RGV: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలను కొనితెచ్చుకోవడంలో ఆర్జీవీ తరువాతే ఎవరైనా అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ మీద ఫోకస్ చేస్తున్న వర్మ.. బయోపిక్ లు తీసే పని మీద పడ్డాడు. ఇంకోపక్క నిజం అనే యూట్యూబ్ ఛానెల్ ను పెన్ చేసి.. అందులో నిజానిజాలను నిగ్గుతేల్చే పనిలో పడ్డాడు. ఇక తాజాగా వర్మ.. ఒక కొత్త ఆఫీస్ ను ఓపెన్ చేశాడు. దానికి ఆర్జీవీ డెన్ అని పేరు పెట్టి.. తనకు నచ్చినట్లు తయారుచేసుకున్నాడు. రెండంతస్తుల ఈ భవనం మొత్తం చూడడానికి అచ్చు డెన్ లానే ఉంది. ఇక తన డెన్ ను టూర్ ను చేసి యూట్యూబ్ లో షేర్ చేశయగా అది కాస్తా వైరల్ గా మారింది. భవనం మీదనే ఆర్జీవీ డెన్ అని రాసి ఉండడం విశేషం. లోపలి వెళ్ళగానే.. ఆర్జీవీ.. తాను పనిచేసిన సెలబ్రిటీలతో దిగిన ఫోటోలు, చుట్టూ చెట్లు.. మధ్యలో ఆర్జీవీ కోట్స్.. హీరోయిన్స్ బికినీ ఫొటోలతో డెన్ ను నింపేసిన సంగతి తెల్సిందే.
ఇక తాజాగా ఈ డెన్ లోకి సర్కారు ఎంటర్ అయ్యాడు. సర్కార్ ఎవరు అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.. సర్కార్ అంటే.. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్. వర్మ దర్శకత్వంలో అమితాబ్ నటించిన చిత్రం సర్కార్. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. తాజాగా హైదరాబాద్ వచ్చిన అమితాబ్.. ఆర్జీవీ డెన్ ను సందర్శించాడు. అమితాబ్ ను వర్మ సాదరంగా తన డెన్ కు ఆహ్వానించాడు. తన సీట్ లో కూర్చోపెట్టి మరీ మర్యాదలు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. నా సీట్ లో సర్కార్ కూర్చున్నాడు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఆ డెన్ కు అమితాబ్ సర్కార్ గా యాప్ట్ అయ్యాడు అనే అతిశయోక్తి కాదు. ఆ కుర్చీకే అందం వచ్చిందయ్యా అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.