Amitabh Bachchan: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూనే కౌన్ బనేగా కరోడ్ పతి షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఎన్నో సీజన్స్ గా ఈ షోను హోస్ట్ చేస్తున్న అమితాబ్ ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఇక తాజగా ఈ షో లో ఆయన ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నీ ఆయనే తన బ్లాగ్ లో రాసుకొచ్చారు. ఒక చిన్న ఇనుప ముక్క ఎడమ కాలికి తగలడంతో తీవ్ర రక్తస్రావం అయ్యిందని, వెంటనే ఆసుపత్రికి తరలించారని చెప్పుకొచ్చారు. గాయం పెద్దది కావడంతో కాలు నరం తెగిందని, వెంటనే వైద్యులు కాలికి కుట్లు వేసి, సెప్టిక్ కాకుండా మందులు ఇచ్చినట్లు తెలిపారు.
ప్రస్తుతం తాను బాగున్నానని, తన గురించి అభిమానులు ఎలాంటి ఆందోళన చెందొద్దని కోరారు. అంతేకాకుండా కొన్నిరోజులు రెస్ట్ తీసుకోవాలని, వాకింగ్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారట. ఇక ఈ విషయం తెలియడంతో అమితాబ్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. పండగ పూట ఇలాంటి ఘటన జరగడం బాధాకరమైన విషయమని చెప్పుకొస్తున్నారు. ఇక అమితాబ్ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం పలు హిందీ ప్రాజెక్ట్స్ చేస్తుండగా.. తెలుగులో ప్రాజెక్ట్ కె లో నటిస్తున్నారు.