Ambajipeta Marriage Band Producer Comments on Comparision with Rangasthalam: సుహాస్ హీరోగా శివాని హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఫిబ్రవరి రెండో తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా అద్భుతం అని చెప్పకపోయినా బావుందని మౌత్ టాకు అయితే ప్రేక్షకుల్లోకి బాగా వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల్లోనే 8 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ సందర్భంగా ఈ సినిమాకి రంగస్థలం సినిమాకి పోలికలు ఉన్నాయని వాదన సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది కదా దాని గురించి మీరు ఏమంటారు అని నిర్మాతను అడిగితే దానికి ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. నిజానికి తనకు రంగస్థలం సినిమాకి ఈ సినిమాకి మధ్య ఎలాంటి పోలికలు కనిపించలేదని ఆయన అన్నారు.
Srimanthudu: శ్రీమంతుడు ‘కథ’కి నారా రోహిత్ హీరో.. కానీ కాపీ కొట్టి మహేష్ తో తీసేశారు!
రంగస్థలం సినిమా అనేది పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా అని పెద్ద స్టార్లు కచ్చితంగా సినిమాకి ఉండి తీరాల్సిందేనని అన్నారు. కానీ ఈ కథ విన్నప్పుడు ఇది పూర్తిగా కొత్త వాళ్లకు రాసుకున్న కథలాగా తనకి అనిపించిందని రెండు సినిమాలకు మధ్య పోలిక అనేది కేవలం కథ పరంగా ఉండి ఉండవచ్చు కానీ తమకు మాత్రం ముందు అసలు ఆ పోలిక ఉందని కూడా అనిపించలేదని అన్నారు. అలాగే కులాల ప్రస్తావన వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటాయేమో అనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తలు తీసుకుని ఎలాంటి ప్రస్తావన లేకుండా సినిమా పూర్తి చేశామని ఆయన అన్నారు. అల్లు అరవింద్ లాంటి ఒక పెద్ద మనిషి ఉన్నాడు కాబట్టే ఈ సినిమా చేశాము లేకపోతే కొత్త వాళ్ళు చేసి ఉంటే కచ్చితంగా డబ్బులు పోగొట్టుకుని వెనక్కి వెళ్లి ఉండేవారు అని ఈ సందర్భంగా ధీరజ్ మొగిలినేని చెప్పుకొచ్చారు.