Amardeep Mother: పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మమ్మల్ని వేధిస్తున్నారు.. నీచంగా వాడి దగ్గరకు పంపిస్తావా అంటూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amardeep Mother: బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ సీజన్ అంతా ఉల్టా ఫుల్టా గా నడుస్తుంది. ఎలిమినేషన్ అయినవాళ్ళు మళ్లీ వస్తున్నారు.. కొత్తవాళ్లకు పవర్స్ ఇస్తున్నారు. పాతవాళ్ళు 5 వారాలు కష్టపడి కంటెండర్ గా మారితే.. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వెంటనే బిగ్ బాస్ వారు కూడా హౌస్ మేట్స్ అని చెప్పడంతో.. ఓల్డ్ కంటెస్టెంట్స్ కు కొద్దిగా కోపం వస్తుంది. ఇక హౌస్ గురించి పక్కన పెడితే.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు బయట మద్దతు గట్టిగానే పెరుగుతుంది. శివాజీ ఇస్తున్న సలహాలతో ప్రశాంత్ గట్టిగానే ఆడుతున్నాడు. అయితే అమర్ దీప్ మొదటినుంచి ఆట మీద ఫోకస్ పెట్టినా ఏదో ఒక గందరగోళం చేసి చివరి నిమిషంలో ప్లాప్ అవుతున్నాడు. ఇక గతవారం అమర్ తన గేమ్ ను ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఇక పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ .. అమర్ దీప్ కుటుంబాన్ని వేధించడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పల్లవి ప్రశాంత్ ఎంత రైతు బిడ్డ అయినా.. యూట్యూబర్ అయినా కూడా బయట మంచి పీఆర్ ను పెట్టాడని వార్తలు వస్తున్నాయి. అయితే వాళ్లు.. కొంతమంది కుర్రాళ్లను పోగుచేసి.. ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకొని.. అమర్ దీప్ ఫ్యామిలీని నీచంగా తిడుతున్నారు. ఇక ఈ విషయమై అమర్ తల్లి స్పందిస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది.
Akira Nandan: పవన్ వారసుడి రాక కోసం.. స్టార్ రైటర్ ఎదురుచూపులు
Also Read
- Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
- Toxic - Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
- Priyanka Chopra : ప్రియాంకా చోప్రా గ్లోబల్ బ్రాండ్ ఇంత స్ట్రాంగ్‌గా ఎలా మారింది?
- Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్‌లో గట్టి పోటీ!
“నేను అమర్దీప్ తల్లిని.. మీకు ఏమైనా మతుండే అలాంటి కామెంట్స్ పెడుతున్నారా? కడుపుకు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? పల్లవి ప్రశాంత్ ఏమైనా పై నుంచి దిగివచ్చాడా?.. ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు.. ప్రశాంత్ దగ్గరకు అమర్దీప్ భార్యని, తల్లిని పంపిస్తావా? ఏం మాట్లాడుతున్నావ్‌రా.. మీకు పల్లవి ప్రశాంత్ మీద ప్రేముంటే ఓట్లేసి గెలిపించుకోరా.. అంతేకానీ తల్లి, భార్యల జోలికి వస్తే ఇంటికి వచ్చి కొడతా. నేను అమ్మను రా.. నన్ను ప్రశాంత్ దగ్గరకు పంపిస్తావా? ఎవడ్రా నీకు చదువు నేర్పింది? కొంచెమైనా సంస్కారం ఉందా?.. నీచమైన బతుకులు మీవి.. ఆడవారిపై ఇలాంటి మాటలు అనడం మీకు సిగ్గుగా లేదు. ఇంట్లోవాళ్లు ఎంతగా బాధపడతారో మీకు తెలియదా.. ? మానసికంగా మమ్మల్ని చంపేస్తున్నారు. నాగార్జున దగ్గరకు వెళ్లి ఇదే విషయం మాట్లాడతా.. ఏమనుకుంటున్నారో, జాగ్రత్త” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
#Amardeep తప్పు చేస్తే అతన్ని తిట్టండి.. అంతే కానీ వాళ్ళ ఫ్యామిలీ ఏం చేశారు రా? దయచేసి ఏ Contestant ఫ్యామిలీ జోలికి వెళ్లకండి, ఆడవాళ్ళ కన్నీరు ఉసురు కచ్చితంగా తగులుతుంది. #Yawar ఫ్యాన్స్ అందరూ ఇలాంటి వాటికి దూరంగా ఉండండి, వాళ్ళలా ప్రవర్తించరని ఆశిస్తున్నా🙏 #BiggBoss7Telugu pic.twitter.com/bIlvMWXW7l
— YAWAR FANS (@KodiKathiMedia) October 16, 2023
తాజావార్తలు
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!