జమ్మూకాశ్మీర్‌లోని భూతల స్వర్గం పహల్గామ్‌లో ఏప్రిల్ 22న పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో టెర్రరిస్టులు 26 మంది అమయకపు జనాన్ని పొట్టనపెట్టుకున్నారు. గుర్తింపు కార్డులు చూసి, మతం అడిగి మరి పురుషులే లక్ష్యంగా భార్యాబిడ్డలు ముందే కాల్చి చంపారు. ఈ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. ఈ ఘటనకు కారణమైన ఉగ్రవాదులను, ఆ నరహంతకుల వెనుకున్న పాకిస్తాన్‌ను వదలిపెట్టేది లేదని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. దీంతో రీసెంట్ గా పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్ పై దాడి చేయడం, ఆ దాడికి వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకుంటూ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతం కావడంతో.
Also Read : Chiranjeevi : సందీప్ రెడ్డి వంగాకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన చిరంజీవి..
ఇటు సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు అంతా కూడా హర్షం వ్యక్తం చేశారు. భారత సైన్యం శక్తి సామర్ధ్యాలు మరోసారి ప్రపంచానికి తెలిశాయంటూ వారు సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు సంతోషంగా ఉంది. జైహింద్ అంటూ భారత సైన్యం సురక్షితంగా ఉండాలని, ప్రతి ఒక్కరు ట్వీట్ చేశారు. అయితే ఈ విషయం పై మాట్లాడిన మలయాళ భామ అమీనా నిజమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురుకుంటుంది..
Also Read : Ileana : నా పిల్లల్ని దానికి దూరంగా పెంచుతాను..
‘ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ లోని ప్రజలను చంపడంపై నేను సిగ్గు పడుతున్నాను. చంపుకోవడం వద్దు’ అని అమీనా చెప్పుకోచ్చింది. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా విరుచుకు పడ్డారు.. అదే పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో అమాయకులైన ఇండియన్స్ కూడా చనిపోయారనే విషయాన్ని మీకు గుర్తుచేయాలా? అంటూ ఆమెను నెటిజన్లు దేశ వ్యతిరేకి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో అమీనా పాకిస్తాన్ ఉగ్రవాదులను పాపం అనడం, వారిపై సానుభూతి చూపించడం ఏ మాత్రం మెచ్చుకోదగ్గ విషయం కాదు అని.. ఇది మీ కెరీర్‌కు కూడా అంత మంచిది కాదు అంటు చిన్న పాటి వార్నింగ్‌లు కూడా ఇస్తున్నారు నెటిజన్లు.