Allu Sirish: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకుగా, స్టార్ హీరో అల్లు అర్జున్ తమ్ముడిగా గౌరవం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు అల్లు శిరీష్. ఈ సినిమా తరువాత మంచి అవకాశాలు వచ్చినా శిరీష్ కు మాత్రం తగినంత పేరు రాలేదని అందరికి తెల్సిందే. మంచి మంచి కథలను ఎంచుకుంటున్నా శిరీష్ మాత్రం విజయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఇక చాలా గ్యాప్ తరువాత ఉర్వశివో రాక్షసివో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ ను అందుకొని ముందుకు సాగుతోంది.
ఇక ఈ చిత్రంలో శిరీష్ సరసన అను ఇమ్మాన్యూయేల్ నటించింది. పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు ఈ జంట లిప్ లాక్ లు, హగ్ లతోనే నింపేశారు. దీంతో ఈ కథ యూత్ కు దగ్గర అయ్యినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రేమికులు పెళ్లి కన్నా లివింగ్ రిలేషన్ వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే పెళ్లి కావాలి అనుకొనే అబ్బాయికి, లివింగ్ బెటర్ అనుకొనే అమ్మాయికి మధ్య జరిగిన ప్రేమ కథనే ఎటువంటి వల్గారిటీ లేకుండా దర్శకుడు తీసిన విధానం బావుందని టాక్ నడుస్తోంది. ఇక లిప్ లాక్ లు, హగ్ లు సైతం అనవసరంగా జొప్పించకుండా సీన్ ను బట్టి వస్తూ ఉండడంతో చూడకూడదు అనే ఫీల్ ను ప్రేక్షకులకు రానివ్వకుండా చేయడంతో మేకర్స్ సక్సెస్ అయ్యినట్లు చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా అల్లువారబ్బాయికి లిప్ లాక్ లు బాగా కలిసి వచ్చి మంచి హిట్ నే అందుకున్నట్లు ఇండస్టర్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. మరి కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే.