Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చాలా ముందు చూపుతో వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ టైమ్ లో చూస్తే ప్రభాస్, ఎన్టీఆర్ ఇతర భాషల డైరెక్టర్ల చేతుల్లో దారుణంగా నష్టపోయారు. ప్రభాస్ అప్పట్లో ఓం రౌత్ ను నమ్మి చేసిన ఆదిపురుష్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఆదిపురుష్ అట్టర్ ప్లాప్ కావడమే కాదు.. ఏకంగా ప్రభాస్ కెరీర్ లో మొదటిసారి విమర్శల పాలు చేసింది. ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత చెత్త సినిమాగా రికార్డు కొట్టింది. ఇటు జూనియర్ ఎన్టీఆర్ మొన్న బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీని నమ్మి వార్-2లో నటిస్తే.. హృతిక్ రోషన్ ముందు ఎన్టీఆర్ ను తక్కువ చేసి చూపించారంటూ ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తున్నారు. పైగా మూవీ కూడా అంతంత మాత్రమే.
Read Also : Mirai : తేజసజ్జా మిరాయ్ వాయిదా పడుతుందా..?
అంతకు ముందు మహేశ్ బాబు తమిళ దర్శకులను నమ్మి నాని, స్పైడర్ లాంటి సినిమాలు చేసి ప్లాపులు మూటగట్టుకున్నారు. రామ్ చరణ్ కూడా జంజీర్ లాంటి సినిమా చేసి బాలీవుడ్ లో నష్టపోయాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఇప్పటి వరకు తెలుగు డైరెక్టర్లతోనే సినిమాలు చేశాడు. అంతకు ముందు లింగుస్వామి లాంటి డైరెక్టర్లు అడిగినా ఒప్పుకోలేదు. ఎంతో మంది బయటి డైరెక్టర్లు సినిమా అవకాశాలు అడిగాని ఇవ్వలేదు. ఇప్పటి వరకు చేసిన వాటిల్లో కొన్ని ప్లాపులు ఉన్నా.. తెలుగు డైరెక్టర్లే చేశారు కాబట్టి డ్యామేజ్ పెద్దగా లేదు. పుష్ప సినిమాలతో భారీ ఇమేజ్ సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు అట్లీతో మొదటిసారి మూవీ చేస్తున్నాడు. బన్నీ కెరీర్ లో వేరే ఇండస్ట్రీ డైరెక్టర్ తో చేయడం ఇదే మొదటిసారి. కానీ అట్లీ ఇప్పటికే షారుక్ లాంటి హీరోతో చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. వరుసగా మంచి సినిమాలే తీస్తున్నాడనే నమ్మకంతోనే భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బన్నీ. ఆచితూచి కథలను ఎంచుకుంటూ డైరెక్టర్లను కూడా అలాగే సెలెక్ట్ చేసుకుంటున్నాడు.
Read Also : Mahesh Babu : మహేశ్ బాబు కూతురు సితారకు ‘ఫేక్’ కష్టాలు..