Allu Arjun: సోషియో ఫాంటసీ డ్రామాతో మాంత్రికుడు రెడీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్ ని స్టైలిష్ స్టార్ గా మార్చింది జులాయి సినిమా. మాటల మాంత్రికుడి కలం పదును జులాయి సినిమాలో కనిపిస్తుంది. ఒకేలా ఆలోచించే ఇద్దరు వ్యక్తులు ఒకరు హీరో-ఇంకొకరు విలన్ అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి మొదలైన జులాయి అల్లు అర్జున్ ని స్టార్ గా మార్చేసింది. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో అల్లు అర్జున్ లోని నటుడిని ఆడియన్స్ కి మరోసారి పరిచయం చేసాడు త్రివిక్రమ్. ఈ సినిమాలో ఉన్నంత సెటిల్డ్ గా అల్లు అర్జున్ ఇంకో సినిమాలో కనిపించడు. ఇక అల్లు అర్జున్ కి పాన్ ఇండియా హిట్ ఇస్తూ త్రివిక్రమ్ అల వైకుంఠపురములో సినిమా చేసాడు. నాన్-బాహుబలి హిట్ గా నిలిచిన ఈ సినిమాలో బంటుగా అల్లు అర్జున్ ఫ్యామిలీ ఆడియన్స్ ని రిపీట్ మోడ్ లో థియేటర్స్ కి రప్పించాడు. ఇలా మూడుసార్లు మూడు రకాల సినిమాలు చేసి హిట్ కొట్టారు త్రివిక్రమ్ అండ్ అల్లు అర్జున్.
అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో కలిసిన ప్రతిసారి ఒక మెట్టు పైకి ఎక్కుతూనే ఉన్నాడు. ఇలాంటి కాంబినేషన్ త్వరలో సినిమా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతోంది. పుష్ప 2 కంప్లీట్ అవ్వగానే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. గుంటూరు కారం నుంచి త్రివిక్రమ్ ఫ్రీ అయిపోయాడు కాబట్టి ఇకపై అల్లు అర్జున్ సినిమా పనులు మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అల్లు అర్జున్-త్రివిక్రమ్ కలిసి సోషియో ఫాంటసీ జానర్ లో సినిమా చేయబోతున్నారు. ఇదే నిజమైతే త్రివిక్రమ్ అల్లు అర్జున్ లోని ఇంకో టాలెంట్ ని బయటకి తీసినట్లే. అయితే ఇప్పుడు అందరిలో ఉన్న డౌట్ ఏంటి అంటే… గుంటూరు కారం సినిమా పోయింది కాబట్టి అల్లు అర్జున్-త్రివిక్రమ్ ఉంటుందా అటకెక్కుతుందా? అని… ఈ డౌట్ క్లియర్ అవ్వాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read
- Jackky Bhagnani: హీరోయిన్ రకుల్‌తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్‌లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
- Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్‌గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు - అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
- Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
- Dil Raju: 'సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..': ప్రొడ్యూసర్ దిల్ రాజు
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!