ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అసలు ఈ సినిమా ఈ రేంజ్ హిట్ అందుకుంటుందని సుకుమార్ కూడా ఊహించలేదు కానీ ఏకంగా బన్నీకి నేషనల్ అవార్డ్‌ను తీసుకొచ్చింది పుష్ప పార్ట్ వన్. అంతేకాదు.. మరో అరుదైన గౌరవం కూడా అందుకున్నాడు బన్నీ. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్, మహేష్ బాబు సరసన చోటు దక్కించుకున్నాడు అల్లు అర్జున్. అందుకే.. పుష్ప2తో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను ఏలెయడానికి వస్తున్నాడు. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ స్టేజ్‌లో ఉంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది. గతంలో పుష్ప2 ఆన్ సెట్స్ ఫోటోలు, వీడియోలు లీక్ అవగా.. లేటెస్ట్‌గా పుష్ప2 షూటింగ్ స్పాట్‌లో ఉన్న ప్లెక్సీ అంటూ.. ఓ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ ప్లెక్సీలో అల్లు అర్జున్ మెగాభిమానిగా కనిపించడం విశేషం.
ఇంద్ర సినిమా థియేటర్ దగ్గర చిరంజీవి కటౌట్ పై… పుష్పరాజ్ ఫోటోతో పాటు యువసేన తిరుపతి అని రాసి ఉంది. రీసెంట్‌గా ఈ థియేటర్ సీక్వెన్స్ షూట్ చేసినట్టుగా చెబుతున్నారు. ఇది నిజంగానే పుష్ప2 షూటింగ్ ఫోటోనా? లేదంటే తిరుపతిలో బన్నీ ఫ్యాన్స్ ఎవరైనా పెట్టిన రియల్ ప్లెక్సీనో? తెలియదు గానీ.. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం థియేటర్లు తగలబడిపోతాయ్ అనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. పుష్ప పార్ట్ వన్‌లో కూడా బాస్ సినిమా ‘చూడాలని ఉంది’ని హైలెట్ చేశాడు సుకుమార్. 1998లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ టైంలో పుష్పరాజ్ కూలోడుగా ఉన్నాడు. ఇక ఇంద్ర సినిమా 2002లో రిలీజ్ అయింది అంటే.. ఈ సమయంలో పుష్పరాజ్ సిండికేట్‌ను ఏలుతుంటాడు. అందుకే.. పుష్ప2లో ఇంద్ర సినిమాకు సంబంధించిన సీక్వెన్స్ ఉండే అవాకాశాలున్నాయి. అది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే… ఆగష్టు 15 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది.