Allu Arjun: బన్నీకి భారీ పారితోషికం.. ప్రభాస్‌కి మించి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun Taking Huge Remuneration For Sandeep Reddy Vanga Project: సాధారణంగానే ఒక హిట్ పడగానే మన హీరోలు తమ పారితోషికాన్ని పెంచేస్తుంటారు. అలాంటిది.. పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు రావడంతో పాటు అదే రేంజ్లో మార్కెట్ వ్యాల్యూ పెరిగితే ఊరికే ఉంటారా? కచ్ఛితంగా తమ పారితోషికాన్ని అమాంతం పెంచేస్తారు. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అదే పని చేసినట్లు తెలుస్తోంది. ‘పుష్ప’తో తనకు పాన్ ఇండియా ఇమేజ్ రావడంతో పాటు గనణీయంగా మార్కెట్ వ్యాల్యూ పెరగడంతో.. బన్నీ ఏకంగా వంద కోట్లకు పడగలెత్తినట్టు ఓ వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికే అతడు పుష్ప 2 సినిమాకి గాను రూ.100 కోట్లు అందుకుంటున్నాడని వార్తలొస్తున్నాయి. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని గాను బన్నీ రూ.125 కోట్లు పారితోషికంగా అందుకుంటున్నాడని సమాచారం.
Lesbian Partner : పెళ్లయిన నెలకే కొత్త పెళ్లి కూతురు జంప్.. కాకపోతే అబ్బాయితో కాదు
Also Read
- Korean Kanakaraju : 'కొరియన్ కనకరాజు' రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్... మరో సర్ప్రైజ్ కూడా
- Peddi Monday Test : ఈ రోజు నుండి 'పెద్ది'కి అసలైన ఆట మొదలు
- Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!... ఈ వారమే ఓటీటీలోకి సూర్య 'కరుప్పు'
- Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్‌లో స్కిన్ షో చేస్తే బూతులు?
‘అర్జున్ రెడ్డి’ని రూపొందించిన సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో బన్నీ ఓ ప్రాజెక్ట్‌కి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే! టీ సిరీస్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా నిర్మిస్తోంది. ఈ చిత్రానికే బన్నీ రూ.125 కోట్లు చార్జ్ చేస్తున్నాడని ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ, ఒకవేళ ఇది నిజమైతే మాత్రం.. ప్రభాస్‌ని బన్నీ అధిగమించినట్టే! ‘బాహుబలి’ పుణ్యమా అని పాన్ ఇండియా స్టార్‌గా అవతరించిన ప్రభాస్.. అప్పటి నుంచి తాను చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టులకు రూ.100 నుంచి రూ.120 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నట్టు టాక్ ఉంది. ఇప్పుడు అతని కంటే రూ.5 కోట్లు ఎక్కువ అమౌంట్‌తో.. బన్నీ అగ్రస్థానంలోకి వచ్చేశాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Shreyas Iyer: నేనింతే.. ఎవరి కోసం నేను మారను.. సర్పంచ్ సాబ్ సంచలన వ్యాఖ్యలు!
-
BharatPe Flex Feature: భారత్‌పే కొత్త ఫ్లెక్స్ ఫీచర్.. UPI ద్వారా నేరుగా రుణాలు.. 45 రోజుల వడ్డీ రహిత క్రెడిట్
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
-
Korean Kanakaraju : ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్… మరో సర్ప్రైజ్ కూడా
-
Realme X3 SuperZoom: 64MP క్వాడ్ కెమెరాలతో.. రియల్మీ ఎక్స్3 సూపర్ జూమ్.. రూ.14 వేల కన్నా తక్కువ ధరకే
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!