Married Woman : పెళ్లయిన నెలకే కొత్త పెళ్లి కూతురు జంప్.. కాకపోతే అబ్బాయితో కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Married Woman: ప్రేమ, ఎప్పుడు ఎవరిపై ఏర్పడుతుందో చెప్పలేము. అంతే కాకుండా లింగభేదంతో కూడా పనిలేదనే ధోరణి ఇటీవల కాలంలో ఎక్కువవుతోంది. పెళ్లైన నెల రోజుల తర్వాత భర్తను వదిలేసి.. తన స్నేహితురాలితో వెళ్లిపోయింది ఓ యువతి. ఈ ఘటన పశ్చిమ్ బెంగాల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు యువతుల మధ్య స్నేహం ఏర్పడింది. స్నేహం కాస్త ప్రేమగా మారింది. ప్రేమలో ఏర్పడిన బంధం శారీరక సంబంధానికి దారితీసింది. ఆపై ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. వీళ్ల సంగతి తెలుసుకున్న ఓ అమ్మాయి తల్లిదండ్రులు హడావుడిగా సంబంధం కుదర్చి పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత కూడా ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. ఎలాగైనా జీవితాంతం కలిసే ఉండాలని నిర్ణయించుకున్నారు. నెల రోజులకే పెళ్లయిన యువతి ఆమె భర్తకు షాకిస్తూ తన ప్రియురాలితో కలిసి జంప్ అయింది.
Read Also: Heart Attack: ఫ్రెండ్స్‌తో థియేటర్ కి వెళ్లాడు.. సినిమా చూస్తూ కుప్పకూలిపోయాడు..
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అలీపూర్‌ద్వార్ జిల్లాలోని ఫలకాటా ప్రాంతానికి చెందిన ఓ యువతి.. కూచ్‌బిహార్ జిల్లాలోని తుఫాన్‌గంజ్ ప్రాంతానికి చెందిన మరో యువతి ఒకే కాలేజీలో చదువుకున్నారు. రెండేళ్ల క్రితం వీరి మధ్య మొదలైన పరిచయం ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత అది మరింత గాఢంగా మారి ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. విషయం తెలిసిన ఓ అమ్మాయి తల్లిదండ్రులు కుమార్తెకు అప్పటికప్పుడు సంబంధం కుదిర్చి వివాహం జరిపించారు.
Read Also: Father Gets Daughter Pregnant: కూతురిని గర్భవతిని చేసిన తండ్రి.. కోర్టు సంచలన శిక్ష
అక్కడితో సమస్య కొలిక్కి వస్తుందని భావించారు. అయితే, వారి ఆశలు ఫలించలేదు. పెళ్లయిన నెల తర్వాత ఆమె ఇంటి నుంచి వెళ్లి ప్రేయసి వద్దకు చేరుకుంది.ఇద్దరూ కలిసి మాల్దాలోని ఓ హోటల్‌లో గది అద్దెకు తీసుకుని అందులో కాపురం పెట్టారు. సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి ప్రశ్నించినా వెనక్కి తగ్గలేదు. తాము మేజర్లమని, తమ సంబంధాన్ని అంగీకరిస్తేనే ఇంటికి వస్తామని, లేదంటే కోర్టుకెళ్తామని తేల్చి చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరూ మాల్దా పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నారు. వారి తల్లిదండ్రుల కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!