ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్లుగా సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో తాజాగా విన్పిస్తున్న బజ్ ప్రకారం బన్నీ రిజెక్ట్ చేసిన స్టోరీకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివల పవర్ ఫుల్ కాంబో మరో ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో “జనతా గ్యారేజ్” అనే బ్లాక్ బస్టర్ మూవీ రూపొందింది. “ఎన్టీఆర్30” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న తాజా ప్రాజెక్ట్ ఎన్టీఆర్, కొరటాల కాంబోలో రాబోతున్న రెండవ చిత్రం. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందనున్న ఈ సినిమా ఫిబ్రవరి 2022లో పట్టాలెక్కనుంది. ఫిబ్రవరి తరువాత రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ స్టూడెంట్ పాలిటిక్స్ తో పాటు యాంగర్ మేనేజ్మెంట్ ప్రధానంగా తెరకెక్కుతుంది అంటున్నారు.
Read Also : అల్లు అర్జున్, ర్యాపిడో…. ఆర్టీసీకి క్షమాపణలు చెప్పాలి : సజ్జనార్
మొదట కొరటాల శివ ఇదే కథను అల్లు అర్జున్‌కి చెప్పాడని, అయితే “నా పేరు సూర్య” చిత్రం కూడా దాదాపు ఇదే కోవలో రూపొందగా, సినిమా అనుకున్న అంచనాలను చేరుకోలేకపోయింది. అందుకే బన్నీ మరోసారి యాంగర్ మేనేజ్మెంట్ ను టచ్ చేయాలనుకోలేదని, ఈ ఆఫర్‌ను తిరస్కరించాడని వర్గాలు చెబుతున్నాయి. తర్వాత కొరటాల తారక్‌కి స్క్రిప్ట్ చెప్పగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మరోవైపు ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ ‘నాగ’ కూడా ఇలాంటి కథాంశంతోనే రాగా, అది బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. మరి ఈసారి ఎన్టీఆర్ యాంగర్ మేనేజ్‌మెంట్‌తో హిట్ కొడతాడా ? అనేది చూడాలి.