పుష్ప సినిమా మొదలు పెట్టినప్పుడు ఒక్క పార్ట్‌గానే మొదలు పెట్టారు. కథ కూడా తెలుగు ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొనే రాసుకున్నాడు సుకుమార్ కానీ రాజమౌళి సలహాతో అనుకోకుండా రెండు పార్ట్‌లుగా డివైడ్ చేశాడు సుక్కు. పాన్ ఇండియా ప్లానింగ్ కూడా అలాగే జరిగింది. అసలు ఎవరు ఊహించని విధంగా పాన్ ఇండియా రేంజులో సెన్సేషన్ క్రియేట్ చేసింది పుష్ప పార్ట్ వన్. ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టింది. మరి అనుకోకుండా చేస్తేనే పుష్పరాజ్ ఇంత రచ్చ చేస్తే… పార్ట్ 2ని అంతకు మించి అనేలా సుకుమార్ తెరకెక్కిస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. పుష్ప 2 సినిమా వెయ్యి కోట్లు టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో? పుష్పగాడి బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఏ రేంజులో ఉంటుందో నెక్స్ట్ ఇయర్ ఆగష్టు 15న చూడబోతున్నాం. ఫస్ట్ లుక్‌తోనే పార్ట్ 2 మీ ఊహకందని విధంగా ఉంటుందని చెప్పేశాడు సుకుమార్. బన్నీని అమ్మవారి గెటప్‌లో చూపించి షాక్ ఇచ్చిన సుక్కు… ప్రజెంట్ అదే లుక్‌కి సంబంధించిన సీక్వెన్స్ షూట్ చేస్తున్నాడు.
“ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో పుష్ప2 షూటింగ్ జరుగుతోంది… జాతర ఎపిసోడ్ షూట్ చేస్తున్నామని.. చేతికి ఉన్న నైల్ పాలిష్ ఇంకా అలాగే ఉంద”ని స్వయంగా బన్నీనే చెప్పుకొచ్చాడు. అయితే… బన్నీ జాతర ఎపిసోడ్ గురించి చెప్పింది కొంచెం కానీ… ఈ సీక్వెన్స్ సినిమాలో గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందట. వందలాది జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్లతో జాతరకు సంబంధించిన షూటింగ్ చేస్తున్నాడు సుకుమార్. పవర్ ఫుల్ సాంగ్‌తో పాటు బన్నీపై షూట్ చేస్తున్న సీన్స్ పూనకాలు తెప్పించేలా ఉంటుందట. ముఖ్యంగా అమ్మవారి గెటప్‌లో బన్నీ డాన్స్, విలన్ల ఊచకోతని సుకుమార్ నెక్స్ట్ లెవల్ అనేలా డిజైన్ చేశాడట. డాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ, దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్ గూస్ బంప్స్ ఇచ్చేలా ఉందని సమాచారం. మరి ఇంత హైప్ ఇస్తున్న పుష్ప2 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.