Allu Arjun Gifts Klin kaara: కోడలికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్.. ఏమిచ్చారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun presented a golden slate to Klin Kaara: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుమార్తె క్లీంకార కొణిదెల రాకతో ఆ ఇంట సంబరాలు నెలకొన్నాయి. రామ్‌చరణ్- ఉపాసన దంపతులకు వివాహం అయిన 11 ఏళ్ల తర్వాత బిడ్డ జన్మించడంతో ఇటు మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా సంబరాలు అంబరాన్నంటేలా చేసుకున్నారు. ఇక తాజాగా కొణిదెల క్లీంకార బారసాల వేడుక కూడా సన్నిహతులు, బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేడుకకు హాజరైన అతిథులు చరణ్- ఉపాసన గారాలపట్టి కోసం వారి సన్నిహితులు, బంధువులు ఎన్నో విలువైన బహుమతులు అందించారు. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బంగారు కాయిన్స్ స్పెషల్ గా డిజైన్ చేయించి బహుమతులుగా పంపినట్లు వార్తలు రాగా ఇప్పుడు అల్లు అర్జున్ క్లీంకారకు ఓ విలువైన కానుకను అందించినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.
KA Paul: నాలుగేళ్ళ నుంచి రమ్మంటున్నా… నేనొద్దు మోడీనే ముద్దంటున్నాడు!
Also Read
బన్నీ తన కోడలికి బంగారు పలకను బహుమతిగా ఇచ్చారు అని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అప్పుడే పుట్టిన పాపకు పలకేంటి అనుకుంటున్నారేమో? పలక అంటే రాసుకునేది కాదండోయ్ క్లీంకార పేరు, ఆమె పుట్టిన వివరాలు వచ్చేలా పలకపై బంగారు అక్షరాలతో చెక్కించి ఇచ్చారట. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా ఫాన్స్- బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మెగా- అల్లు కుటుంబాల మధ్య దూరం పెరిగింది అని ప్రచారం జరుగుతున్న వేళ ఇప్పుడు ఈ వార్తతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప-2 పాన్ ఇండియా సినిమాగా పుష్ప 1 కంటే పెద్ద స్పాన్ లో తెరకెక్కుతుంది. ఇక ఈ రెండవ భాగంపైన భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ ఏమో శంకర్‌తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తుండగా ఆ తరువాత బుచ్చిబాబు డైరెక్షన్లో తన 16వ సినిమా చేయబోతున్నారు.
తాజావార్తలు
-
Nagababu: మాకు ప్రాణ వాయువు మా అన్నయ్య
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
-
Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..