ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బోయపాటి హిట్ మూవీని చేజేతులా చేజార్చుకున్నాడట. ఈ విషయాన్నీ స్వయంగా బన్నీనే వెల్లడించాడు. అయితే ఇది ఇప్పటి మాట కాదు. బోయపాటి, అల్లు అర్జున్ కాంబోలో ‘సరైనోడు’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు త్వరలో వీరిద్దరి కాంబో రిపీట్ కానుంది. అయితే ఈ రెండు ప్రాజెక్టులే కాకుండా అల్లు అర్జున్ తన కెరీర్ మొదట్లోనే బోయపాటి హిట్ సినిమాలో అవకాశం వస్తే , దానిని పక్కన పెట్టి మరో సినిమా చేశాడట.
Read Also : బాలయ్య నోట జూనియర్ ఎన్టీఆర్ మాట !
నిన్న జరిగిన ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో ఈ విషయాన్ని వెల్లడించాడు అల్లు అర్జున్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “భద్ర”. ఈ సినిమాలో రవితేజ, మీరా జాస్మిన్ జంటగా నటించారు. ‘భద్ర’ రవితేజ కెరీర్లోనే కీలకమైన మ్యాజికల్ మ్యూజిక్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా అవకాశం ముందుగా అల్లు అర్జున్ దగ్గరకు వచ్చిందట. అదే సమయంలో అల్లు అర్జున్ వేరే సినిమా చేస్తుండడంతో దానిని వదులుకోవాల్సి వచ్చిందట. ఏదేమైనా కెరీర్ మొదట్లోనే అల్లు అర్జున్ ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీని వదులుకోవడం రవితేజకు కలిసి వచ్చింది !