ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మళ్ళీ యాక్షన్ లోకి దిగారు. అయితే సినిమా కోసం కాదు. అల్లు అర్జున్, త్రివిక్రమ్‌లది హ్యాట్రిక్ కాంబో. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు పండగే. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈ ద్వయం మరోసారి వార్తల్లో నిలిచింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో మరో ఫిల్మ్ రావట్లేదు కానీ యాడ్ ఫిల్మ్ మాత్రం వస్తోంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి ఇండియన్ ఆన్లైన్ బైక్ టాక్సీ అగ్రిగేటర్ రాపిడో కోసం ఒక యాడ్ ఫిల్మ్ షూట్ చేసారు. ఈ యాడ్ ను అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన ప్రత్యేక సెట్లో చిత్రీకరించారు. ఈ బ్లాక్‌బస్టర్ ద్వయం ఈసారి రాపిడో యాడ్‌తో వీక్షకులకు ఏం చెప్పాలనుకుంటుందో చూడాలి.
Read Also : తండ్రి కాళ్ళకు దండం పెట్టి కన్నీళ్ళు పెట్టిన నాగార్జున!
ప్రస్తుతం అల్లు అర్జున్ “పుష్ప” సినిమాతో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో, రష్మికం మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. మరోవైపు త్రివిక్రమ్ ‘భీమ్లా నాయక్’తో పాటు మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న సినిమా కోసం వర్క్ మొదలు పెట్టారు.