Dhoom : ధూమ్ ఫ్రాంఛైజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఫ్రాంచైజీ పై భారతీయ ప్రేక్షకులకు ఉన్న ఆసక్తి గురించి తెలిసిందే. ధూమ్, ధూమ్ 2, ధూమ్ 3 ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. ఇందులో ధూమ్ 2 పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీసు వద్ద సంచలన విజయం నమోదు చేసింది. అమీర్ ఖాన్ నటించిన ధూమ్ 3, హృతిక్ రోషన్ నటించిన ధూమ్ 2 స్థాయి విజయం సాధించకపోయినా కానీ, ఫ్రాంఛైజీ చిత్రంగా అది కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లే రాబట్టింది. అయితే ధూమ్ చిత్రంతో జాన్ అబ్రహాం ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. అతడి నెగెటివ్ పాత్ర అందరినీ ఆకట్టుకోగా, అదే బాటలోనే హృతిక్, అమీర్ ఖాన్ కూడా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలను ఫ్రాంఛైజీలో కొనసాగించారు. ఫస్ట్ రెండు పార్టులకు సంజయ్ గద్వి దర్శకత్వం వహించగా, అమీర్ ఖాన్ నటించిన మూడో భాగం మాత్రం విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో వచ్చింది. ఇకపోతే ధూమ్ ఫ్రాంఛైజీ నుంచి ధూమ్ 4 తెరకెక్కనుందని తెలుస్తోంది. యష్ రాజ్ ఫిలింస్ ఈసారి కూడా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని కొన్నేళ్లుగా ప్రచారం ఉంది. కానీ ఈ సినిమా కాస్టింగ్ విషయంలో బ్యానర్ ఎందుకో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ధూమ్ 4లో ప్రధాన పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేయాలి? అనే డైలమాలోనే చాలా కాలంగా ఉంది. నెగెటివ్ షేడ్ ఉన్న కీలక పాత్ర కోసం రణబీర్ కపూర్ ని ఎంపిక చేసుకుని ముందుకు సాగుతోంది ఈ బ్యానర్. యానిమల్ లాంటి పాన్ ఇండియా హిట్టు కొట్టిన రణబీర్ కి ధూమ్ 4లో ఛాన్స్ ఇవ్వడం యష్ రాజ్ బ్యానర్ తీసుకున్న సరైన నిర్ణయంగా భావించాలి.
Read Also:Palnadu Crime: పండుగపూట విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
అయితే మొదటి మూడు భాగాల్లో అభిషేక్ బచ్చన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. ఆ పాత్రతో అతడికి ఒరిగిందేమీ లేదు కానీ, సహాయక పాత్రలో అతడు స్టైలిష్ గా కనిపించేందుకు ప్రయత్నించాడు. ఇకపోతే, ఇప్పుడు ఆ పాత్రను ఒక దక్షిణాది హీరోకి ఆఫర్ చేస్తారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. చాలా కాలంగా ప్రభాస్ ను యష్ రాజ్ బ్యానర్ ధూమ్ 4 కోసం సంప్రదిస్తోందని గుసగుసలు ఉన్నాయి. కానీ అది కన్ఫామ్ కాలేదు. మరోవైపు పుష్ప ఫ్రాంఛైజీతో సంచలన విజయాలు అందుకున్న అల్లు అర్జున్ కి కూడా యష్ రాజ్ ఫిలింస్ ఛాన్స్ ఇచ్చేందుకు ఆస్కారం ఉందని ఇప్పుడు అభిమానులు ఊహిస్తున్నారు. అయితే బాలీవుడ్ హీరోలకే ఛాలెంజ్ చేస్తున్న ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్లకు ఇలాంటి అవకాశం కల్పించినా కానీ, వారు సహాయక పాత్రలో నటిస్తారా లేదా? అన్నది డౌటే. ఒకవేళ ఇందులో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో అవకాశం కల్పించి ఉంటే అలాంటి పెద్ద స్టార్లు ఓకే చెప్పేవారని కూడా విశ్లేషిస్తున్నారు.
Read Also:Relationship Tips: ఈ పనులు ఆడవాళ్లకు అస్సలు నచ్చవు?.. మీ భార్య ముందు ఇవి చేయకండి..