Allu Aravind : అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న తాజా మూవీ సింగిల్. శ్రీ విష్ణు హీరోగా, కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా చేస్తున్నారు. కార్తీక్ రాజు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ లాంచ్ నిర్వహించారు. ఇందులో అల్లు అరవింద్ కు మీడియా రిపోర్టర్లు కొన్ని ప్రశ్నలు వేశారు. ట్రైలర్ లో ‘ఆడవాళ్లు కాక్రోచ్ లాంటి వాళ్లు’ అనే డైలాగ్ ఉంది. అలా పోల్చడం అంటే మహిళలను అవమానించడమే కదా అని రిపోర్టర్ ప్రశ్నించగా అల్లు అరవింద్ దానిపై క్లారిటీ ఇచ్చారు. ఈ డైలాగ్ ఎందుకు పెట్టాం అనేది చాలా మందికి సరిగ్గా తెలియదన్నారు.
Read Also : Baahubali : బాహుబలి రీరిలీజ్.. ఎప్పుడంటే..?
‘బొద్దింకలు అనుబాంబు పేలినా బతకగలవు. ఆడవాళ్లు చాలా శక్తిమంతులు. అంటే క్లిష్ట పరిస్థితులను కూడా ఆడవారు తట్టుకోగలరు అనే అర్థం వచ్చే విధంగా వారిని బొద్దింకలతో పోల్చారు. అంతే తప్ప ఇందులో వేరే ఉద్దేశం ఏమీ లేదు’ అంటూ అరవింద్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుందని.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికే ఈ సినిమా చేశామన్నారు. ఇప్పటి వరకు ఎవరూ ఇలాంటి సినిమా చూసి ఉండదరని తెలిపారు. అలాగే బన్నీవాస్ తమ సంస్థ నుంచి తప్పుకోలేదన్నారు. ఆయన గీతా ఆర్ట్స్ కు చాలా కీలకం అని.. ఆయన త్వరలోనే భారీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారంటూ చెప్పుకొచ్చారు అరవింద్.