Allu Aravind: కెజిఎఫ్ లేకపోతే యశ్ ఎవరు.. ? ఎంత పెద్ద హీరో అతను..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Aravind: శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం కోటబొమ్మాళీ పీఎస్. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ (గీతా ఆర్ట్స్) బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. మలయాళ సూపర్ హిట్ సినిమా నాయట్టు కు అధికారిక రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా నేడు ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర బృందంతో పాటు.. నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నాడు. ఇక ఆయనకు కూడా చాలా ప్రశ్నలను సంధించారు జర్నలిస్టులు. ముఖ్యంగా గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి చిన్న చిన్న సినిమాలు తప్ప పెద్ద సినిమాలు ఎందుకు రావడం లేదు అన్న ప్రశ్నకు.. ” నిర్మాణ వ్యయం దానికి కారణం కాదు.. సినిమా నిర్మాణ వ్యయం విషయానికి వస్తే అందరూ చెప్పేది హీరోల రెమ్యునరేషన్ గురించే” అని చెప్పుకొచ్చాడు. ఇక దానికి కొనసాగింపుగా అత్యధిక రెమ్యూనిరేషన్ తీసుకొనే హీరో మీ ఇంట్లోనే ఉన్నాడుగా.. అని అడుగగా.. దానికి అల్లు అరవింద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
Katrina Kaif: టవల్ ఫైట్.. ఆవిరి నిండిన గదిలో ఎలా చేశామంటే ..?
Also Read
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Posani Krishna Murali: ఒక రోజుకు పోసాని కృష్ణమురళి తీసుకునే రెమునరేషన్ ఇదేనట!
“చెప్పాలంటే.. నిర్మాణ వ్యయంలో హీరోలు తీసుకోలేం రెమ్యూనిరేషన్ కేవలం అత్యధికంగా 20 నుంచి 25 శాతం. అందుకే హీరోల వల్ల ఖర్చు పెరిగిపోతుంది అనడం కన్నా.. పెంచిన సినిమాల్లో హీరోలు ఉంటున్నారు అని అనిపిస్తుంది నాకు. పేర్లు చెప్తే బాగోదు.. కొన్ని సినిమా నిర్మాణ వ్యయాలు ఎంతున్నాయో మీరు గమనించండి. తక్కువే ఉన్నాయి. హీరోలతో సంబంధం లేకుండా ఇవాళ పెద్దగా చూపిస్తే తప్ప పెద్ద సినిమాలను ప్రేక్షకులు ఆదరించరు. కెజిఎఫ్ రాకముందు అతను (యశ్) ఎవరు.. ? ఎంత పెద్ద హీరో అతను? సినిమాను పెద్దగా చూపించారు కాబట్టే ఆ సినిమా ఆడింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!