అల్లరి నరేష్… కామెడి సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి… తక్కువ సమయంలోనే స్టార్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. మినిమమ్ గ్యారెంటీ హీరో అని అందరితో అనిపించుకున్న అల్లరి నరేష్, దాదాపు యాభై సినిమాలు ఒకే జానర్ లో చేసి హిట్స్ కొట్టాడు. ఒకే జానర్ సినిమాలని చేసి మొనాటమీలో పడిపోయిన అల్లరి నరేష్, ఆ తర్వాత ఊహించని డౌన్ ఫాల్ ని చూశాడు. అక్కడి నుంచి అల్లరి నరేష్ ఏ సినిమా చేసినా ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదు. దీంతో తనకి కంచుకోటలాంటి కామెడిని వదిలి అల్లరి నరేష్ మొదటిసారి ప్రయోగం చేశాడు. అదే నాంది సినిమా, ఈ నాంది చిత్రమే అల్లరి నరేష్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఈ మూవీ అల్లరి నరేష్ లోని కొత్త కోణం బయటకి తీసింది, అతనిలోని సీరియస్ నటుడిని అందరికీ పరిచయం చేసింది. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేసిన ‘నాంది’ మూవీతో అల్లరి నరేష్ కెరీర్ కొత్తగా షేప్ చేసింది. అల్లరి నరేష్ కామెడీ మాత్రమే కాదు అన్ని ఎమోషన్స్ ని పండించగలడు అని ఆడియన్స్ నమ్మేలా చేసింది. నాంది నుంచి హిట్ ట్రాక్ ఎక్కిన అల్లరి నరేష్, నాంది కాంబినేషన్ నే రిపీట్ చేస్తూ విజయ్ కనకమేడలతో ‘ఉగ్రం’ సినిమా చేసాడు.
షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేసిన ‘ఉగ్రం’ సినిమాలో పోలిస్ గెటప్ లో అల్లరి నరేష్ మాస్ హీరో అనిపించే రేంజులో ఉన్నాడు. మీసాలు తిప్పి, మాస్ డైలాగులని కూడా చెప్పిన అల్లరి నరేష్, కంప్లీట్ మేకోవర్ లో కొత్తగా కనిపించాడు. మాస్ ఎలిమెంట్స్ కి పూర్తిగా స్కోప్ ఉన్న ఉగ్రం సినిమాతో అల్లరి నరేష్ మరో హిట్ అందుకోవడం గ్యారెంటీ అనే హైప్ తో ఈ సినిమా మే 5న ఆడియన్స్ ముందుకి వచ్చింది. మిర్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి కానీ అవి ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేదు. ఉగ్రం సినిమా నరేష్ కి పేరు తెచ్చింది కానీ సాలిడ్ హిట్ ని మాత్రం ఇవ్వలేకపోయింది. ఈ కారణంగా 45 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా నెల కూడా తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. జూన్ 2 నుంచి ఉగ్రం సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. మరి థియేటర్స్ లో ఓకేగా రాణించిన ఈ మూవీ ఓటీటీలో ఎంత వరకూ ఆదరిస్తారో చూడాలి.
a cop’s race against time to unmask the truth and save his family! ⚡️#UgramOnPrime, June 2 pic.twitter.com/Z9mLaU2HFZ
— prime video IN (@PrimeVideoIN) May 31, 2023