దళపతి విజయ్, లోకేష్ కానగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన సెకండ్ సినిమా ‘లియో’. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన వీకెస్ట్ సినిమాగా పేరు తెచ్చుకున్న లియో మూవీ కలెక్షన్స్ మాత్రం దుమ్ము లేపుతుంది. 12 రోజుల్లో 540 కోట్లకి పైగా కలెక్ట్ చేసి లియో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమిళనాడులో సూపర్బ్ స్ట్రాంగ్ గా ఉన్న లియో దసరా సెలవలు అయిపోయిన తర్వాత కూడా స్లో అవ్వట్లేదు. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో లియో సినిమా కాస్త స్లో అయినా కోలీవుడ్ లో మాత్రం బుకింగ్స్ అదరగొడుతోంది. 100 కోట్ల షేర్ కోలీవుడ్ లో మార్కెట్ లో రాబట్టి 2023 బిగ్గెస్ట్ హిట్ లో ఒకటిగా లియో సినిమా నిలిచింది. నిజానికి మొదటి రోజు వచ్చిన టాక్ ని బట్టి లియో సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అయ్యే అవకాశం కనిపించట్లేదు అనే కామెంట్స్ వినిపించాయి.
రిలీజ్ రోజున వినిపించిన అనుమానాలని పటాపంచలు చేస్తూ లియో సినిమా అన్ని సెంటర్స్ లో సూపర్బ్ బుకింగ్స్ ని రాబడుతూనే ఉంది. దీంతో మేకర్స్ గ్రాండ్ సక్సస్ మీట్ కి ఏర్పాటు చేసారు. లియో ఆడియో లాంచ్ జరగలేదు. అభిమానులు లియో ఆడియో లాంచ్ కోసం చాలా వెయిట్ చేసారు కానీ ప్రభుత్వం నుంచి పర్మిషన్ రాకపోవడంతో ఆడియో లాంచ్ క్యాన్సిల్ అయ్యింది. ఆ లోటుని భర్తీ చేయడానికి ఇప్పుడు లియో సక్సస్ మీట్ రెడీ అయ్యింది. ఈరోజు ఈవెనింగ్ ఆరు గంటలకి, చెన్నైలోని నెహ్రు స్టేడియమ్ లో లియో సక్సస్ మీట్ జరగనుంది. ఇప్పటికే ఈ ఈవెంట్ కి ఏర్పాట్లు కూడా కంప్లీట్ అయ్యాయి. విజయ్ మైక్ తీసుకోని #EnNenjilKudiyirukkum అనగానే ఆ ప్రాంగణం అంతా దద్దరిల్లిపోవడం గ్యారెంటీ.