Alia Bhatt: బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్- అలియా భట్ తల్లిదండ్రులుగా మారిన విషయం తెలిసిందే. ఇటీవలే అలియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కపూర్ ఫ్యామిలీలో ఆనందాలు వెదజల్లాయి. నిన్ననే అలియా కూతురుతో కపూర్ ఇంట అడుగుపెట్టింది. ప్రస్తుతం కపూర్ కుటుంబమంతా రణబీర్ బిడ్డను చూడడానికి బయల్దేరారు. అయితే ఇక్కడే ఒక చిన్న చిక్కు వచ్చి పడింది. బిడ్డను చూడాలంటే ఒక కండిషన్ పెట్టిందట అలియా.. తన బిడ్డను చూడాలంటే ఖచ్చితంగా కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉండాలని చెప్పిందంట.
కరోనా సమయంలో అందరూ ఎంత ఇబ్బంది పడ్డారో అందరికి తెల్సిందే. ఇక ఈ విషయాన్ని గుర్తించిన అలియా.. తన బిడ్డకు ఎలాంటి అనారోగ్యం రాకుండా ముందు నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నదట. ఇక ఈ కండిషన్ తో బంధువులు కొంతమంది నిరాశకు గురవుతున్నారట. మరి ఈ జంట తమ ముద్దుల కూతురును మీడియా అభిమానులకు ఎప్పుడు చూపిస్తుందో చూడాలి.