అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప ఓవర్ ఆల్ గా హిట్ టాక్ ని తెచ్చుకొని ముందుకు సాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల కలెక్షన్లను రాబట్టి సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ సినిమాపై సెలబ్రెటీలు తమదైన రీతిలో స్పందిస్తూ పుష్ప టీమ్ కి అబినందనలు తెలియజేస్తున్నారు.
ఇక తాజాగా పుష్ప టీం కి శుభాకాంక్షలు తెలిపారు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్. ట్విట్టర్ వేదికగా “కంగ్రాచ్యులేషన్స్ అల్లు అర్జున్.. ఇండియా మొత్తంగా ‘పుష్ప’కు వస్తున్న భారీ స్పందన మీకు లభించినందుకు. మరొక అద్భుతమైన విజయాన్ని మన ఇండస్ట్రీ అందుకొంది. నిజంగా త్వరలోనే ఈ సినిమా చూడడానికి ప్లాన్ చేస్తాను” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.