Akshay Kumar: ఛత్రపతి శివాజీగా మారిన బాలీవుడ్ ఖిలాడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akshay Kumar: బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ఇటీవలే రామసేతు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకొని నిరాశపర్చింది. ఇక సినిమా సినిమాకు కొద్దిగా కూడా గ్యాప్ ఇవ్వని అక్షయ్ తాజాగా మరో సినిమాను మొదలుపెట్టేశాడు. బయోపిక్ లు తీయాలన్నా, ప్రయోగాలు చేయాలన్నా బాలీవుడ్ లో అక్షయ్ ముందు ఉంటాడు. ఇప్పటికే కేసరి, సామ్రాట్ పృద్విరాజ్ లాంటి పీరియాడిక్ సినిమాలలో నటించి మెప్పించిన అక్షయ్ ఇప్పుడు ఛత్రపతి శివాజీగా మారాడు.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం వేదాంత్ మరాఠీ వీర్ దౌడ్లే సాత్. ఈ సినిమాతో అక్షయ్ మరాఠీ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. మహారాష్ట్ర దిగ్గజ రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో అక్షయ్ కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా నేడు షూటింగ్ ను మొదలుపెట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఇక ఛత్రపతి శివాజీ లుక్ లో అక్షయ్ అద్భుతంగా కనిపించాడు. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నా కూడా ఆ రాజసం, ఠీవి కనిపించాయి. ఇక ఈ ఫోటోను షేర్ చేస్తూ అక్షయ్ ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమాలో నటించడం తన అదృష్టమని, ఈ చిత్రం కోసం తనవంతు కృషి చేస్తానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
- Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
- Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
- Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
తాజావార్తలు
-
Konaseema: తుఫాన్ విధ్వంసం.. కరెంట్ లేక అంధకారంలో 200 గ్రామాలు.. ప్రజల కష్టాలు వర్ణనాతీతం
-
CM Vijay: తేని జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్.. సీఎం విజయ్ సంచలన చర్య, అధికారులపై వేటు!
-
Arnab Cyclone: ఏపీకి కేంద్ర బృందాలు.. అర్నబ్ తుఫాన్ నష్టాలు, ఖరీఫ్ కరువుపై క్షేత్రస్థాయి పరిశీలన
-
Meerpet : సీజ్ చేసిన ఫోన్, బంగారాన్ని కాజేసిన కానిస్టేబుల్ అరెస్ట్!
-
Pawan Sahu : యూట్యూబ్‌లో 2.77 కోట్ల సబ్స్క్రైబర్లు.. ఏం లాభం? భార్యను సర్పంచ్‌గా గెలిపించలేకపోయాడు!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!