Akkineni Nagarjuna: నాగ్ సరసన ఆమె.. మరీ చిన్న పిల్లలా ఉందే.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akkineni Nagarjuna: చిత్ర పరిశ్రమలో.. ముఖ్యంగా టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఎంత ఏజ్ వచ్చినా.. వారి పక్కన కుర్ర హీరోయిన్స్ మాత్రమే నటిస్తుంటారు. దీని గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పినా కూడా.. అది మాత్రం మారడం లేదు. అఖండ లో బాలకృష్ణ సరసన ప్రగ్య జైస్వాల్ నటించినప్పుడు .. అరే మరీ చిన్నపిల్లలా ఉందే అనుకున్నారు. ఆ తరువాత చిరంజీవి సరసన శృతి హాసన్ చేసినప్పుడు ఆలాగే జరిగింది. ఇక ఇప్పుడు నాగ్ విషయంలో కూడా అభిమానులు అదే మాట అంటున్నారు. అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రం నా సామీ రంగ. విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిశ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నాడు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ మూవీకి కథ మరియు డైలాగులు అందించాడు. మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ పోరింజు మరియమ్ జోస్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోందని టాక్. ఇక నేడు ఈ సినిమాలో హీరోయిన్ ను మేకర్స్ పరిచయం చేశారు.
Rashmika: డీప్ ఫేక్ వీడియో కన్నా ఘోరం.. ఏంటి రష్మిక ఇది.. ?
Also Read
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
- Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి
- Ranveer - Deepika: దువాతో రణవీర్ – దీపిక క్యూట్ ఫ్యామిలీ పిక్స్ వైరల్.. బేబీ బంప్‌తో దీపిక స్పెషల్ అట్రాక్షన్!
వరలక్ష్మి అనే పాత్రలో ఆషికా రంగనాధ్ నటిస్తుందని గ్లిమ్ప్స్ ద్వారా తెలిపారు. అచ్చ తెలుగు ఆడపిల్లల ఆమె రెడీ అయిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక ఆమె రెడీ అవుతుండగా.. పక్కనే ఉన్న గోడ పక్కనుంచి నాగ్ ఆమెను చూస్తూ ఉండడం కనిపించింది. అయితే.. వీరిద్దరి జోడి కొద్దిగా ఎబెట్టుగా ఉందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. నాగ్ సరసన ఆషికా చిన్న పిల్లలా కనిపిస్తుందని అంటున్నారు. నాగ్ కు తగ్గ జోడీని పెడితే బావుండేది అనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే కథను బట్టి, పాత్రను బట్టి తీసుకొనే ఛాన్స్ కూడా ఉండొచ్చు..అది సినిమా చూస్తే తెలుస్తోంది అని ఇంకొందరు అంటున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో నాగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
-
PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
-
Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
-
Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
-
Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!