Akkineni Nagarjuna: ఈ సంక్రాంతి పోటీ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐదు స్టార్ హీరోల సినిమాలు.. సంక్రాంతి పోటీలో నిలిచాయి. ఎవరికి తగ్గ ప్రమోషన్స్ వారు చేసుకుంటున్నారు. కానీ, చివరి నిమిషంలో మాస్ మహారాజా రవితేజ వెనక్కి తగ్గదు. ఈగల్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకొని ఫిబ్రవరి 9 ను లాక్ చేసుకుంది. ఇక ఈగల్ తగ్గడంతో.. నాలుగు సినిమాలు మిగిలాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామీ రంగా. ఇవన్నీ కూడా స్టార్ హీరోల సినిమాలే. ఒక్క హనుమాన్ ను పక్కన పెడితే.. మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున మధ్య పెద్ద పోటీనే ఉంది. సంక్రాంతికి ఇంకా పట్టుమని పది రోజులు కూడా లేదు. ఈ కాలంలో సినిమా ఎలా ఉన్నా కూడా ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై హైప్ పెంచడం వలనే ప్రేక్షకులు థియేటర్ల వైపు అడుగులు వేస్తున్నారు. ఇక ప్రమోషన్ల విషయంలో మహేష్ బాబు, వెంకటేష్, తేజ సజ్జా ఢోకా లేకుండా చేసేస్తున్నారు.
గుంటూరు కారం కు ఎప్పటినుంచో హైప్ ఉంది. నిత్యం నాగవంశీ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ మరింత హైప్ పెంచుతున్నాడు. ఇక హనుమాన్.. మొదటి సూపర్ హీరో సినిమా అని, దైవ భక్తితో ప్రశాంత్ వర్మ ఎలాగో మార్కులు కొట్టేశాడు. ఇక వెంకటేష్.. సైంధవ్ కూడా ట్రైలర్ రిలీజ్ చేసి.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ హైప్ పెంచుతుంది. ఒక్క నాగ్ మాత్రమే ఇంకా అనుకున్న ప్రమోషన్స్ ను, హైప్ ను రీచ్ కాలేకపోతున్నాడు. ఎందుకంటే ఇంకా ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. ఆ షూట్ బిజీలో ఉండి..ప్రమోషన్స్ సరిగ్గా చేయలేకపోతున్నారు. లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయినా కూడా వాటికి సరైన ప్రమోషన్స్ లేక హైప్ రావడంలేదు. ఇంకా ఈ సినిమా డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ అన్ని పూర్తి చేసుకొని ప్రమోషన్స్ మొదలుపెట్టాలి. ఇంత తక్కువ టైమ్ లో ఇవన్నీ అవుతాయా.. ? అనేది డౌట్. రేసులో ఉంచడం ముఖ్యం కాదు బాసూ.. హైప్ ఎక్కించడం ముఖ్యం.. నాగ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో నాగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.