Akkineni Nagarjuna: కింగ్ ఈజ్ బ్యాక్.. దాదాపు ఏడాది తరువాత అక్కినేని నాగార్జున సెట్ లో అడుగుపెట్టాడు. ఘోస్ట్ సినిమా తరువాత నాగార్జున మరో సినిమా ప్రకటించింది లేదు. బిగ్ బాస్ తప్ప సినిమా సెట్ లో అడుగుపెట్టింది లేదు. అసలు నాగార్జున సినిమాలు ఎందుకు చేయడం లేదు.. ? చేస్తాడా.. ? ఆపేశాడా.. ?అనే అనుమానాలు కూడా వెల్లువెత్తాయి. ఇక ఆ సమయంలోనే నాగ్.. నా సామీ రంగా సినిమాను ప్రకటించాడు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ.. దర్శకుడిగా మారి.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ప్రసన్న కుమార్ బెజవాడ కథను అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్లూరి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం. మలయాళంలో భారీ హిట్ అందుకున్న పోరింజు మరియమ్ జోస్ కు రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఊర మాస్ అవతారంలో నాగ్.. అదరగొట్టేశాడు.
Rajkumar Hirani: ఒక్క ప్లాప్ కూడా లేని డైరెక్టర్.. బాలీవుడ్ కు దొరికిన డైమండ్
ఇక కొన్నిరోజుల క్రితం ఈ సినిమా షూట్ మొదలయ్యింది. తాజాగా షూటింగ్ లో ఉన్న నాగ్ ఫోటో ఒకటి లీక్ అయ్యింది. సెట్ లో నాగ్ తో ఒక అభిమాని కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రగ్గడ్ లుక్ లో నాగార్జున మాస్ లుక్ లో కనిపించాడు. ముదురు ఆకుపచ్చ కలర్ షర్ట్.. గాగుల్స్.. నున్నగా అదిమిన జుట్టు.. గడ్డం తో అదరగొట్టేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. నా సామీ రంగా.. ఏమున్నాడ్రా కింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి నాగ్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.