Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akka Trailer: వెండితెరపై ఎప్పుడూ బొద్దుగా, ముద్దుగా, చీరకట్టులో పద్ధతిగా కనిపించే కీర్తి సురేశ్‌ను చూసి అలవాటుపడ్డ కళ్లకు.. ‘అక్క’ ట్రైలర్ ఒక గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. చేతిలో తుపాకీ పట్టుకుని, రౌద్రపు చూపులతో, చుట్టూ రౌడీలను పెట్టుకుని ఆమె చేసిన రచ్చ చూసి అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ నటి రాధికా ఆప్టే, కీర్తి సురేశ్ ముఖాముఖి తలపడిన ‘అక్క’ వెబ్ సిరీస్ ట్రైలర్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వెబ్‌సిరీస్ కథ 1985 బ్యాక్‌డ్రాప్‌లో పేర్ణూరు అనే ఒక వింత ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. అక్కడ మగవాళ్ల మాట అస్సలు చెల్లదు. 800 ఏళ్లుగా కేవలం ఆడవాళ్ల మాటే శాసనం. ఆ గద్దెనెక్కిన నాయకురాలిని అందరూ ‘అక్క’ అని పిలుచుకుంటారు. అక్కడ పెళ్లిళ్లు ఉండవు, కేవలం ఆడపిల్లల పేర్ల మీదే ఇళ్ల గుర్తింపు నడుస్తుంది. ఆ ఊళ్లో అడుగుపెట్టి వ్యాపారం చేయాలన్నా, బతకాలన్నా ఈ అక్కల ముఠాకు కమీషన్ సమర్పించుకోవాల్సిందే. ఎదురుతిరిగిన ఎంతటి మొనగాడినైనా లేపేయడం వీళ్లకు వెన్నతో పెట్టిన విద్య.
అయితే ఎవరికీ తలవంచని ఈ సామ్రాజ్యాన్ని తుదముట్టించేందుకు ‘రుద్ర’ పాత్రలో రాధికా ఆప్టే ఎంట్రీ ఇవ్వడంతో కథలో అసలైన నిప్పు రాజుకుంది. అక్కను, ఆమె గ్యాంగ్‌ను మట్టుబెట్టేందుకు సుపారీ తీసుకున్న కిల్లర్‌గా రాధికా కనిపించబోతోంది. “ఇది బాంబే కాదు.. ఇక్కడ తుపాకీ బుల్లెట్లతో పంచాయితీలు తేలవు, చంపడమే ఒక బిజినెస్” అంటూ రాధికా వేసే డైలాగులు రక్తం మరిగేలా ఉన్నాయి. “ఆమె ఆడ రూపంలో ఉన్న రాక్షసి.. ఆ రాక్షసిని నేనే అంతం చేస్తా” అంటూ ఆమె చేసే సవాల్ ట్రైలర్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. యష్‌రాజ్ ఫిలింస్ సమర్పణలో దర్శకుడు ధర్మరాజ్ శెట్టి చెక్కిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌లో.. కీర్తి సురేశ్ వైలెంట్ లుక్, రాధికా ఆప్టేతో నడిచే మైండ్ గేమ్స్ ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తున్నాయి. అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లోకి రాబోతున్న ఈ సిరీస్ ఓటీటీ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
AP Localbody Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. SEC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
ట్రెండింగ్
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి