Akira Nandan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అచ్చం తండ్రి పోలికలే రావడంతో ఆయన సినీ ఎంట్రీపై చాలా అంచనాలు పెరుగుతున్నాయి. అకీరాను బిగ్ స్క్రీన్ పై చూడాలని ఉందంటూ ఇప్పటికే రేణూ దేశాయ్ చెప్పింది. అయితే అకీరా కూడా ఈ నడుమ ట్రెండింగ్ లో ఉంటున్నాడు. ఏపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ కల్యాణ్ తన వెంట అకీరా నందన్ ను వెంట పెట్టుకుని వెళ్లిన సంగతి తెలిసిందే. చాలా సార్లు అకీరా నందన్ మెగా ఫ్యామిలీ స్టార్లతో కనిపిస్తూనే ఉన్నాడు. ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఈవెంట్ లో కూడా మెరిశాడు. ఇక రామ్ చరణ్ నిర్మాణంలోనే అకీరా ఎంట్రీ ఉంటుందనే ఊహాగానాలు చాలానే వచ్చాయి. కానీ వాటిపై ఇంకా క్లారిటీ రాలేదు.
Read Also : Kalyanram : నా కోసం ఎన్టీఆర్ వస్తున్నాడు.. కల్యాణ్ రామ్ క్లారిటీ..
కానీ అకీరా ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా అకీరా లుక్ ఛేంజ్ చేసేశాడు. మొన్నటి వరకు తండ్రి లాగానే లాంగ్ హెయిర్, మీసాలు, గడ్డంతో కనిపించాడు. తాజాగా రేణూ దేశాయ్ చేసిన పోస్టులో గడ్డం తీసేసి కోరమీసాలతో కనిపిస్తున్నాడు. ఎక్కడకో ట్రిప్ కు వెళ్లగా అక్కడ దిగిన ఫొటోను రేణూ ఇలా పోస్టు చేసింది. ఈ ఫొటో క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. అకీరా భలే మారిపోయాడే అంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. సేమ్ టు సేమ్ పవన్ కల్యాణ్ లాగానే ఉన్నాడే అంటూ ఆమె పోస్టును రీ పోస్టు చేస్తున్నారు నెటిజన్లు. అకీరా ఇప్పుడు యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే గ్రాండ్ గా ఎంట్రీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.