Kalyanram : నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న మూవీ సన్నాఫ్ వైజయంతి. ఇందులో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి హీరో తల్లి పాత్రలో నటిస్తోంది. ఆమెది చాలా పవర్ ఫుల్ రోల్. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ముచ్చటైన బంధాలే అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. కర్నూలులోని ఓ కాలేజీలో ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక్కడ నందమూరి కల్యాణ్ రామ్ మాట్లాడుతూ.. అనేక విషయాలను పంచుకున్నాడు. తల్లి గొప్పతనాన్ని ఓ కథ రూపంలో చెప్పి అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశాడు. ఇక చివరగా అందరికీ కావాల్సిన అప్ డేట్ కూడా ఇచ్చేశాడు కల్యాణ్ రామ్.
Read Also : HIT-3 : హిట్-3 నుంచి మాస్ సాంగ్.. ట్రైలర్ డేట్ వచ్చేసింది..
ఈ నెల 12వ తేదీని మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు తెలిపాడు. ఆ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నట్టు స్పష్టం చేశాడు. ఆ రోజు అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం అంటూ తెలిపాడు. ఆ మాట చెప్పగానే ఫ్యాన్స్ అరుపులతో గ్రౌండ్ మార్మోగిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నట్టు ఇప్పటికే చాలా రూమర్లు వచ్చాయి. కానీ తాజాగా దానిపై క్లారిటీ ఇచ్చాడు కల్యాణ్ రామ్. ముచ్చటైన బంధాలే సాంగ్ లో తల్లి, కొడుకుల మధ్య అనుబంధాన్ని చూపించారు. ఇది చాలా ఎమోషనల్ గా సాగే పాట అని తెలుస్తోంది.