Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Akhil Akkineni Birthday Special

Akhil Akkineni: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఈ ‘ఏజెంట్’!

Published Date :April 8, 2022 , 6:00 am
By Roja Pantham
Akhil Akkineni: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఈ ‘ఏజెంట్’!
  • Follow Us :
  • google news
  • dailyhunt

తాత ఏయన్నార్ మహానటుడు. తండ్రి నాగార్జున టాప్ స్టార్. అన్న నాగచైతన్య యంగ్ హీరోస్ లో తనకంటూ ఓ స్థానం సంపాదించాడు. ఇక మిగిలింది అక్కినేని అఖిల్ వంతు. ఏడాది దాటిన వయసులోనే అఖిల్ ‘సిసింద్రీ’గా జనాన్ని మెప్పించాడు. అప్పటి నుంచీ అక్కినేని ఇంట మరో ప్రతిభావంతుడు పుట్టాడని జనం భావించారు. దోగాడే పసిపాపగా ఉన్న రోజుల్లోనే అలరించిన అఖిల్ కథానాయకునిగానూ మెప్పిస్తాడని అభిమానులు ఆశించారు. ఎందుకనో వారి ఆశలు అంతగా ఫలించలేదు. గత యేడాది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’గా జనం ముందు నిలచి తొలి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు అఖిల్. ఇప్పుడు ‘ఏజెంట్’గా మురిపించే ప్రయత్నంలో ఉన్నాడు అఖిల్.

అఖిల్ అక్కినేని 1994 ఏప్రిల్ 8న కాలిఫోర్నియాలోని శాన్ జోస్ లో జన్మించాడు. అక్కినేని నాగార్జున, అమల దంపతుల నోముల పంటగా జన్మించిన అఖిల్ సంవత్సరం వయసులోనే ‘సిసింద్రీ’ చిత్రంలో నటించి అలరించాడు. ఆ తీరును ఇప్పటికీ అభిమానులు మరచిపోలేరు. అమ్మ అమల, నాన్న నాగార్జున – ఇద్దరూ తెరపై మేటి నటీనటులుగా వెలిగారు. వారి జీన్స్ అఖిల్ ను సినిమా రంగంవైపే పరుగులు తీయించాయి. చిత్రసీమలోకి యంగ్ హీరోగా అడుగుపెట్టక ముందు అఖిల్ క్రికెట్ లో భలేగా రాణించాడు. ఆస్ట్రేలియా వెళ్ళి మరీ క్రికెట్ లో  శిక్షణ తీసుకున్నాడు. ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్ కోసం టాలీవుడ్ స్టార్స్ క్రికెట్ ఆడిన సమయంలో అఖిల్ కూడా బ్యాటింగ్ చేసి జనాన్ని ఆకట్టుకున్నాడు. అప్పట్లో అఖిల్ ఏ జట్టులో ఉంటే ఆ టీమ్ గెలుస్తుందని సినీజనం భావించేవారు.

అఖిల్ క్రికెట్ లో అలరించింది మొదలు అక్కినేని అభిమానులు అఖిల్ ను తెరపై చూడాలని ఆశిస్తూనే ఉన్నారు. అభిమానుల కోరిక తీర్చడానికి అన్నట్టు అక్కినేని హీరోలు అందరూ కలసి నటించిన ‘మనం’ చిత్రంలో తాత, తండ్రి, అన్నతో కలసి ఓ సీన్ లో కాసేపు కనిపించాడు. అందులో అఖిల్ ఎంట్రీ చూసిన అభిమానులు ఆనందంతో చిందులు వేశారు. తరువాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో అఖిల్ సోలో హీరోగా ‘అఖిల్’మూవీతో ప్రేక్షకుల ముందు నిలిచాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. తరువాత ‘హలో’తో ఆకట్టుకొనే ప్రయత్నం చేయగా అదీ అంతగా అలరించలేదు. ఇక తమ అక్కినేని ప్యామిలీకి అచ్చి వచ్చిన ‘మజ్ను’ టైటిల్ ను తగిలించుకొని ‘మిస్టర్ మజ్ను’ని నేనేనంటూ వచ్చాడు. అదీ నిరాశనే మిగిల్చింది. సోలో హీరోగా మూడు సినిమాలతోనూ ఆకట్టుకోలేకపోయిన అఖిల్ నాల్గవ చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’తో తొలి విజయాన్ని అందుకున్నాడు. మరి ఈ పుట్టినరోజు తరువాత అఖిల్ ‘ఏజెంట్’గా ఆగస్టు 12న జనం ముందు నిలువనున్నాడు. ఒకసారి సక్సెస్ పలకరించింది కదా, తరువాత కూడా విజయపథంలోనే అఖిల్ సాగుతాడని అభిమానుల అభిలాష. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘ఏజెంట్’ అఖిల్ కు ఎలాంటి ఆనందం పంచుతుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akhil Akkineni
  • birthday special
  • happy birthday
  • latest news
  • telugu cinima

తాజావార్తలు

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions