నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన ‘అఖండ’ విడుదలై ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పన్నక్కర్లేదు.. బాలయ్య మాస్ యాక్షన్.. థమన్ మాస్ మ్యూజిక్ ఈ సినిమాను అఖండ విజయాన్ని అందించాయి.. ఇక ఈ హిట్ సినిమా బాలీవుడ్ లోకి వెళ్లబోతుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం రీమేక్ ల హవా నడుస్తున్న ఈ సమయంలో అఖండను కూడా బాలీవుడ్ లో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.. ఇకపొతే .. బాలయ్య లాంటి మాస్ హీరో ని తలదన్నే హీరో ఎవరు బాలీవుడ్ లో అనేది హాట్ టాపిక్ గా మారింది.
అందుతున్న సమాచారం ప్రకారం అఖండ రీమేక్ లో అజయ్ దేవగన్ కానీ, అక్షయ్ కుమార్ కానీ కనిపించనున్నారట.. వీరిద్దరిలో ఎవరో ఒకరిని మేకర్స్ ఫైనలైజ్ చేయనున్నారట.. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాలని పని లేదు. ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో జీవించేస్తారు. అయితే బాలయ్య ఇంటెన్సిటీని వారు మ్యాచ్ చేయగలరా ..? అని బాలయ్య అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత ఉందొ తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే..