తల అజిత్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘తునివు’. బోణీ కపూర్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై కోలీవుడ్ వర్గాల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఉన్నస్ హైప్ ని మరింత పెంచుతూ ‘తునివు’ సినిమా నుంచి రీసెంట్ గా ‘చిల్లా చిల్లా’ అనే సాంగ్ బయటకి వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఘిబ్రాన్ ట్యూన్ ని, అనిరుద్ వాయిస్ కలిసి ‘చిల్లా చిల్లా’ సాంగ్ ని సూపర్ హిట్ చేశాయి. ఇప్పుడు ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ బయటకి రానుంది. #KasethanKadavulada అనే పాట ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకి రిలీజ్ చేయ్యనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
#KasethanKadavulada సాంగ్ అనౌన్స్మెంట్ బయటకి వచ్చినప్పటి నుంచి అజిత్ ఫాన్స్, ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మనీ మనీ అంటూ డబ్బు చుట్టూ తిరిగేలా డిసైన్ చేసిన పాట, అజిత్ కి చాలా ఇష్టమైన పాటని చిత్ర యూనిట్ ప్రచారం చేస్తున్నారు. మరి అజిత్ కి అంత నచ్చిన సాంగ్, ఆడియన్స్ కి ఎంత వరకూ నచ్చుతుందో చూడాలి. ఇదిలా ఉంటే ‘తునివు’ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. విడుదల తేదిని ప్రకటించారు కానీ ప్రమోషన్స్ మాత్రం అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. ఒక టీజర్ లేదు, ట్రైలర్ లేదు, ప్రోమో సాంగ్స్ అనే మాటే లేదు. పోస్టర్స్ ని కూడా పొదుపుగా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. విజయ్ తన ‘వారుసుడు’ సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్న సమయంలో, అజిత్ సినిమా ప్రమోషన్స్ సైలెంట్ గా జరగడం అనేది ‘తునివు’ ఓపెనింగ్స్ ని దెబ్బ తీసే విషయమే. మేకర్స్ ‘తునివు’ సినిమాని ఇంకాస్త అగ్రెసివ్ గా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది.