తల అజిత్ కోలీవుడ్ సూపర్ స్టార్. ప్రస్తుతం హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా “వాలిమై” సినిమా తెరకెక్కుతోంది. రష్యాలో ప్లాన్ చేసిన ఈ సినిమా చివరి షెడ్యూల్ తాజాగా పూర్తయ్యింది. “వాలిమై” టీం మొత్తం తిరిగి చెన్నై ప్రయాణమైంది. అయితే అజిత్ మాత్రం లగేజ్ ప్యాక్ చేసుకుని అటు నుంచి అటే బైక్ పై వరల్డ్ కు సిద్ధమయ్యాడని సమాచారం. అజిత్ కు ఏరో-మోడలింగ్, పిస్టల్ షూటింగ్, ఫోటోగ్రఫీ, మోటార్ రేసింగ్‌తో పాటు, ఖరీదైన బైక్ లు మొదలైన వాటిపై చాలా ఆసక్తి ఉంది. ఆయన రోడ్ ట్రిప్‌లు చేయడానికి ఇష్టపడతాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో సిక్కింలోని రోడ్డు పక్కన అజిత్ భోజనం చేస్తున్న పిక్స్ వైరల్ అయ్యాయి.
Read Also : ముందే ఈడీ కార్యాలయానికి చేరుకున్న రకుల్
అజిత్ తన బైక్‌పై 10,800 కిమీల దూరం ప్రయాణించాడని సమాచారం. లాక్‌డౌన్ తర్వాత అజిత్ తన మోటార్‌సైకిల్‌పై ప్రపంచ పర్యటనను ప్రారంభించాడు. విభిన్న వాతావరణ పరిస్థితులను అలవాటు చేసుకోవడానికి ఆయన ఈశాన్య భారతదేశానికి వెళ్లాడు. ప్రస్తుతం రష్యాలో “వాలిమై” చివరి షెడ్యూల్ పూరయ్యింది. కాబట్టి అజిత్ తన బైక్‌లో రష్యాలో మరిన్ని ప్రదేశాలను కవర్ చేయడానికి బైక్ ట్రిప్‌కు వెళ్లాడు.