AK 64 : మరోసారి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో అజిత్ కుమార్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిట్టిచ్చిన దర్శకులను రిపీట్ చేయడం అజిత్‌కు బాగా అలవాటు. కెరీర్ స్టార్టింగ్ నుండి ఈ పంథా ఫాలో అవుతున్నాడు. అగత్యాన్, సుభాస్, విష్ణువర్థన్, రాజ్ కపూర్, శరణ్, శివ, హెచ్ వినోద్ వరకు ఇదే సెంటిమెంట్ కంటిన్యూ చేశాడు. అయితే శివ, హెచ్ వినోద్‌లకు మాత్రం గ్యాప్ లేకుండా ఛాన్సులిచ్చాడు తలా. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోలేదు ఈ ఇద్దరు. వేదాళం, వివేగం, విశ్వాసం లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు శివ. నేరకొండ పర్వాయ్, వాలిమై, తనివు రూపంలో ఏకేకు హ్యాట్రిక్ అందించాడు హెచ్ వినోద్.
Also Read : Prashanth Neel : KGF – 3లో తమిళ స్టార్ హీరో..?
Also Read
ఈ ఫిబ్రవరిలో ఎన్నో ఎక్స్ పర్టేషన్స్‌తో వచ్చిన విదాముయర్చి హిట్టు అయ్యుంటే గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత అజిత్‌ను డీల్ చేసే ఛాన్స్ ఉండేది మగిజ్ తిరుమేనికి. కానీ బొమ్మ థియేటర్లలో డిజాస్టర్ కావడంతో గోల్డెన్ ఆపర్చునిటీని కోల్పోయాడు మగిజ్. ఇక రీసెంట్లీ రిలీజైన గుడ్ బ్యాడ్ అగ్లీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పుడు డిస్కర్షన్ అంతా ఏకే 64పైనే నడుస్తోంది. అజిత్ నెక్ట్స్ సినిమాను డీల్ చేసేది ఎవరన్న డౌట్ నెలకొంది. ఇప్పటికే హీరో ధనుష్ ఒక కథ రెడీ చేసి అజిత్‌తో సినిమా చేయాలని వార్తలు వచ్చాయి. కానీ చివరకు గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌కు ఆ ఛాన్స్ దక్కినట్లు కోలీవుడ్‍లో బజ్ నడుస్తోంది. గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్ ఫ్యాన్స్‌కు మాస్ ఫీస్ట్ ఇచ్చిన సీనియర్ హీరో ప్రభు అల్లుడు అధిక్ రవిచంద్రన్ మరోసారి అజిత్ కుమార్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు అని ఆల్మోస్ట్ కన్ఫమ్ అన్నది లేటెస్ట్ టాక్. మరోసారి మైత్రీ మూవీ మేకర్స్ ఏకేతో మూవీని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు బజ్ నడుస్తోంది. అజిత్ 64ను నెక్ట్స్ ఇయర్ రిలీజ్ చేసే యోచనలో ఉన్నారన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది. హై ఓల్టేజ్ మూవీగా తీసుకురాబోతున్నట్లు సమాచారం. దీని తర్వాతే ధనుష్ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఏకే 64 గురించి త్వరలో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేసే అవకాశాలున్నాయి.
తాజావార్తలు
-
Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!