Tegimpu: తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న ‘తునివు’ సినిమాను తెలుగులో ‘తెగింపు’ పేరుతో విడుదల చేయబోతున్నారు. తమిళంలో బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా తమిళనాడులో విజయ్ ‘వారిసు’తో పోటీపడుతోంది. తెలుగు రాష్ట్రాలలో మాత్రం చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’తో పాటు విజయ్ ‘వారసుడు’తో బాక్సాఫీస్ వార్‌కు సిద్ధం అవుతోంది. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాను జీ స్టూడియోస్, బోనీకపూర్ సమర్పణలో రాధాకృష్ణ ఎంటర్ టైన్ మెంట్స్, ఐవివై ప్రొడక్షన్స్ సంస్థలు విడుదల చేస్తున్నాయి. మంజు వారియర్, సముద్రఖని, ప్రేమ్ కుమార్, జాన్, వీరా ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు నీరవ్ షా కెమెరామేన్ కాగా, జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ‘తెగింపు’ తెలుగు, తమిళ భాషల్లో సంక్రాంతి పండగకు సందడి చేయనుంది.
Read Also: NTR: ఎన్టీఆర్ కే ఆస్కార్..?