కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు కోలీవుడ్ లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో టాలీవుడ్ లోనూ అంతే ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే అజిత్ తమిళ్ సినిమాలన్నీ తెలుగులోనూ డబ్ అవుతాయి. ఇటీవలే అజిత్ నటించిన ‘వలిమై’ ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించిన విషయం విదితమే. ఇక తాజాగా అజిత్ 61 మొన్నీమధ్యే గ్రాండ్ గా లాంఛ్ అయింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇపప్టికే వీరిద్దరి కాంబోలో రెండు సినిమాలు రావడంతో ప్రేక్షకులు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ఇక ఈ సినిమాలో అజిత్ విలన్ గా నటిస్తున్నాడట.. అదేంటి అజిత్ విలన్ అయితే.. మరి హీరో ఎవరు అనుకుంటున్నారా..? హీరో, విలన్ రెండు అజిత్ యేనని సమాచారం. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజిత్ ద్విపాత్రాభినయం చేయనున్నాడట. ఒకరు హీరో అయితే మరొకరు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు టాక్. డిఫరెంట్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజిత్ సరసన టబు, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియదు కానీ .. అజిత్ జ నెగెటివ్ షేడ్ లో కనిపిస్తే మాత్రం అభిమానులకు పండగే అని టాక్ వినిపిస్తోంది. మరి అది నిజమో కాదో తెలియాలంటే మేకర్స్ నోరువిప్పాల్సిందే.