Ajay Gadu Teaser: అజయ్ కతుర్వార్.. ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 5 లో కనిపించి తన గేమ్ తో ఎంతోమంది అభిమానులను పోగేసుకున్నాడు. ఇక విశ్వక్ సినిమాతో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న అజయ్ కతుర్వార్ బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాకా చేస్తున్న చిత్రం “అజయ్ గాడు”. అజయ్ కతుర్వార్ దర్శకత్వం వహించిన ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ను అజయ్ కుమార్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చందన కొప్పిశెట్టి స్వయంగా నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
అజయ్ గాడు పవర్ ప్యాక్డ్ టీజర్‌తో ఆకట్టుకుంటున్నాడు. అజయ్ కతుర్వార్ ప్రేమ గురించిన చమత్కారమైన డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతుంది.. అందులో అతను తన ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. అందరి దృష్టిని ఆకర్షించడానికి అద్భుతమైన విజువల్స్‌తో యాక్షన్‌లో అజయ్ కతుర్వార్ ఫ్లాష్ కట్స్ లో కనిపించి షాక్ ఇచ్చాడు. టీజర్ లో యాక్షన్, రొమాన్స్ మరియు ఎమోషన్ల పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌తో అందరి ఆసక్తిని రేకెత్తించింది. అధిక నిర్మాణ విలువలు, ఇంటెన్స్ యాక్షన్ మరియు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అజయ్ కతుర్వార్ ఇంటెన్స్ లవ్ స్టోరీతో వస్తున్నట్లు కనిపిస్తోంది. అందాల భామలు భాను శ్రీ, శ్వేతా మెహతా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి అజయ్ నాగ్ మరియు హర్ష హరి జాస్తి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ హీరో అయినా హిట్ కొట్టి బిగ్ బాస్ పేరు నిలబెడతాడేమో చూడాలి.