Aishwarya Rai: వాళ్లిద్దరిలో బెటర్ హాఫ్ ఎవరో చెప్పలేం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aishwarya Rai Speech At Ponniyin Selvan Pre Release Event: మణిరత్నం రూపొందించిన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్-1 ఈనెల 30వ తేదీన విడుదల అవుతున్న సంగతి తెలిసిందే! దీంతో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన చిత్రబృందం.. తాజాగా హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ‘అందరికీ నమస్కారం’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఐశ్వర్య రాయ్.. ఇంత ఘనస్వాగతం పలికినందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ఇంత గొప్ప టీమ్‌తో కలిసి పని చేసినందుకు చాలా గర్వంగా ఉందని పేర్కొంది. అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి కెమెరా ముందు నటించిన నటీనటులు దాకా.. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారని చెప్పింది. మణిరత్నం డ్రీమ్‌కు ప్రాణం పోసేందుకు తమకు దక్కిన అవకాశాన్ని గౌరవంగా భావిస్తున్నానంది.
సెల్యూలాయిడ్‌పై ఒక అద్భుతమైన పెయింటింగ్‌లాగా మణిరత్నం ఈ సినిమాను తీర్చిదిద్దారని ఐశ్వర్య కొనియాడింది. ఈ సినిమా తన జీవితంలో చిరస్మరణీయంగా మిగిలిపోతుందని చెప్పుకొచ్చింది. ఇక ఇదే సమయంలో సుహాసిని, మణిరత్నం అన్యోన్య దాంపత్య జీవితం గురించి మాట్లాడుతూ.. వాళ్లిద్దరిలో బెటర్ హాఫ్ ఎవరో చెప్పడం కష్టం కానీ, వాళ్లు ఒక కంప్లీట్ పిక్చర్ అని తెలిపింది. మణిరత్నం, సుహాసినిలతో కలిసి తాను చేస్తోన్న తొలి సినిమా ఇదని.. తన వ్యక్తిగత జీవితంలోనూ సుహాసిని ఎంతో ప్రభావం చూపారని, తన కుటుంబంలో ఓ సభ్యులుగా ఆమె నిలిచిపోయారని చెప్పింది. ఇక ఏఆర్ రెహమాన్ అందించిన ఎన్నో మ్యాజికల్ పాటల్లో తాను భాగం అయినందుకు అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొంది. ఇక చివరగా.. ప్రతిఒక్కరూ ఈ సినిమా చూడాలని, థియేటర్లలో ఎంజాయ్ చేయాలని ఐశ్వర్య కోరింది.
Also Read
- Hanuman Ansh: రూ.100 కోట్లతో ‘‘హనుమాన్ అంశ్’’ వసూళ్ల సునామీ.. ఆ రాష్ట్రంలో ట్యాక్స్ ఫ్రీ..
- Poonam Pandey: శృంగార వీడియోలు ‘‘సామాజిక సేవ’’.. వ్యభిచారంపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు..
- Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున 'మీర్జాపూర్' కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
- Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!