పనామా పేపర్స్ లీక్ కేసులో ఐష్… 5 గంటలు ఈడీ విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పనామా పేపర్ లీక్ కేసుకు సంబంధించి విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన ఆరోపణలపై బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. వాస్తవానికి నవంబర్ 9, 2021న ఈడీ ముందు హాజరు కావాల్సిందిగా ఐశ్వర్యను అడిగారు. కానీ ఆమె వ్యక్తిగత కారణాలను చూపుతూ విచారణను దాటవేశారు. అయితే మళ్లీ ఈడీ నోటీసులు అందజేసి డిసెంబర్ 20న విచారణకు పిలిచింది. నిన్న ఉదయం న్యూఢిల్లీలో దిగిన ఐశ్వర్య నేరుగా ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. ఫారెక్స్ నిబంధనలను ఉల్లంఘించి విదేశాల్లో సంపదను దాచుకున్నారనే ఆరోపణలను ఆమె ఎదుర్కొంటున్నారు.
దాదాపు ఐదు గంటల పాటు ఈడీ ఐశ్వర్యను ప్రశ్నించింది. ఆమె విదేశీ ప్రయాణ చరిత్రపై ఈడీ విచారణ చేపట్టింది. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్)ని ఉపయోగించి తన భర్త అభిషేక్ బచ్చన్ విదేశీ బ్యాంకు ఖాతాలో చేసిన పెద్ద డిపాజిట్‌పై కూడా ఐష్ ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మరి ఈ విచారణలో ఈడీ ఎలాంటి వివరాలు రాబట్టింది అనేది ఆసక్తికరంగా మారింది. 2016లో పనామా పేపర్లు లీక్ కాగా అందులో 500 మంది భారతీయ ప్రముఖుల పేర్లు ఉన్నాయి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పేరు కూడా అందులో భాగమైంది. అయితే సీనియర్ బచ్చన్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని ఖండించారు.
Also Read
- Faria :దళపతి విజయ్ వారసుడు 'ఫ్యూచర్ సీఎం' .. సంజయ్‌పై నటి ఫరియా అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
- Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
- Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
- Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ 'లవ్ అండ్ వార్' ఫస్ట్ లుక్ రిలీజ్
తాజావార్తలు
-
Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!
-
Mandadi : 100 కోట్ల క్లబ్లో సుహాస్-సూరిల ‘మండాడి’.. ప్రత్యేకంగా అభినందించిన కమల్
-
Harish Rao : హరీశ్ వర్సెస్ కాంగ్రెస్.. ఇక కోర్టులోనే.!
-
SIR row: CEC జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం.!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!