బాలీవుడ్ లో పనామా పేపర్ లీక్స్ కేసు హడలు పుట్టిస్తోంది. విదేశాల్లో అక్రమంగా పెట్టుబడులు పెడుతున్నారని ఈడీ విచారణలో తెలియడంతో బాలీవుడ్ ప్రముఖులను ఈడీ విచారిస్తుంది. ఇప్పటికే సోమవారం బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ ఈడీ విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 2016లో పనామా నుంచి నడిచే ఓ లా కంపెనీకి చెందిన రూ.11.5 కోట్లకు సంబంధించిన ట్యాక్స్ డాక్యుమెంట్ లీకు అయ్యాయి. వాటి గురుంచి మూడు గంటలు పలు రకాల ప్రశ్నలను ఐష్ ని అడిగారు అధికారులు.…
పనామా పేపర్ లీక్ కేసుకు సంబంధించి విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన ఆరోపణలపై బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. వాస్తవానికి నవంబర్ 9, 2021న ఈడీ ముందు హాజరు కావాల్సిందిగా ఐశ్వర్యను అడిగారు. కానీ ఆమె వ్యక్తిగత కారణాలను చూపుతూ విచారణను దాటవేశారు. అయితే మళ్లీ ఈడీ నోటీసులు అందజేసి డిసెంబర్ 20న విచారణకు పిలిచింది. నిన్న ఉదయం న్యూఢిల్లీలో దిగిన ఐశ్వర్య నేరుగా ఈడీ…