Abhiram Daggubati: మూవీ మొఘల్, స్వర్గీయ డి. రామానాయుడు మనవడు, ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు తనయుడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘అహింస’. ప్రముఖ దర్శకుడు తేజ డైరెక్షన్ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై పి. కిరణ్ ఈ సినిమాను నిర్మించారు. ఈ యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉంది. అతి త్వరలోనే గ్రాండ్ గా మూవీని రిలీజ్ చేసేందుకు నిర్మాత కిరణ్ సన్నాహాలు చేస్తున్నారు. విశేషం ఏమంటే… పేరులో అహింస అనే పదం ఉన్నా.. మూవీలో భారీ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని లేటెస్ట్ గా విడుదల చేసిన పోస్టర్స్ చూస్తుంటే అర్థమౌతోంది.
ఇప్పటికే విడుదలైన ‘అహింస’ ఫస్ట్ లుక్, టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిందని, అలాగే ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ‘నీతోనే నీతోనే’, ‘కమ్మగుంటదే’ పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయని నిర్మాత కిరణ్ తెలిపారు. ఇక తాజా పోస్టర్స్ లో అభిరామ్ యాక్షన్ ఇంటెన్స్ లుక్ ను చూస్తుంటే… తేజ రామానాయుడు మనవడిని బాగానే కష్టపెట్టినట్టు అర్థమౌతోంది. గీతికా తివారీ, రజత్ బేడీ, సదా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోసించిన ఈ సినిమాకు అనిల్ అచ్చుగట్ల సంభాషణలు రాయగా, కోటగిరి వెంకటేశ్వరరావు కూర్పరి!