దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ తేజ తెరకెక్కించిన 'అహింస' మూవీ ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది. అయితే ఇప్పటికే ఆ తేదీన రవితేజ 'రావణాసుర', కిరణ్ అబ్బవరం 'మీటర్' చిత్రాలు విడుదల కాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు తనయుడు అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ తేజ దర్శకత్వంలో కిరణ్ 'అహింస' పేరుతో సినిమా తీస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే జనం ముందుకు రానుంది.