బాలీవుడ్ లో పోష్ కల్చర్ ఉంటుంది అని తెలుసు కానీ.. మరి ఇంతగానా అని నెటిజన్లు నోర్లు వెళ్లబెడుతున్నారు. బార్యభర్తలు విడకులు తీసుకొని విడిపోవడం చూసి ఉంటాం.. వారు విడివిడిగా మరొకరిని పెళ్లి చేసుకోవడం కూడా చూసి ఉంటాం .. కానీ ఎప్పుడైనా విడిపోయిన భార్యాభర్తలు స్నేహితులుగా కలిసి ఉంటూ వారు మరొక లవర్ తో కలిసి తిరుగుతూ ఎదురెదురు పడితే.. అబ్బా వినడానికే ఏదోలా ఉంది కదా.. కానీ బాలీవుడ్ లో ఇవన్నీ కామన్ అన్నట్లు ఉంది ప్రస్తుత పరిస్థితి.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన భార్య సుస్సేన్ ఖాన్ తో విడిపోయిన సంగతి తెల్సిందే. ఇక విడిపోయాక కూడా ఈ జంట స్నేహితులుగా, పిల్లలకు తల్లిదండ్రులుగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు.
ఇక ఈ రిలేషన్ ని పక్కన పెడితే గత కొన్నాళ్ల నుంచి ఈ మాజీ జంట మరో కొత్త జంట తో రిలేషన్ లో ఉన్న సంగతి కూడా విదితమే. హృతిక్ రోషన్, నటి సబా ఆజాద్ తో సుస్సేన్ ఖాన్, నటుడు అర్స్లాన్ గోని తో ప్రేమాయణం సాగిస్తున్నారు. త్వరలోనే ఈ జంటలు పెళ్లితో ఒక్కటి కానున్నాయని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక తాజాగా ఈ మాజీ భార్యాభర్తలు తమ కొత్త లవర్స్ తో ఎదురెదురు అయ్యారు. ముంబై ఎయిర్ పోర్ట్ లో ఈ దృశ్యం కెమెరాల కంటికి చిక్కింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే కొత్త లవర్స్ తో అలా కనిపించేసరికి వారి ఫేస్ లు కూడా కొద్దిగా మారినట్లు కనిపిస్తున్నాయి. మరి త్వరలో ఈ జంటలు ఒక్కటి కానున్నాయా..? లేక ఇవి కూడా మోడ్రన్ కల్చర్ లానే కొన్నిరోజులు విడిపోతాయా అని చూడాలి.