‘మేజర్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు అడివి శేష్. శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డు కలెక్షన్స్ ను రాబట్టింది. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమాను మహేష్ బాబు నిర్మించాడు. ఇక ప్రస్తుతం మేజర్ సక్సెస్ జోష్ లో ఉన్న అడివి శేష్ ఇటీవల ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగతమైన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. చిన్న చిన్న పాత్రలను చేస్తూ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం వెనుక పదేళ్ల కష్టం ఉందన్న శేష్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కు తాను గొప్ప అభిమానిని అని చెప్పుకొచ్చాడు.
తనకు అమెరికాలో ఉండడం కన్నా ఇండియాలో ఉండడమే ఇష్టమని, మంచు లక్ష్మిలా మాట్లాడితే తిడతారని కష్టపడి తెలుగు నేర్చుకున్నట్లు చెప్పాడు. ఇక పెళ్లీడు వయసు వచ్చింది.. పెళ్లెప్పుడు చేసుకుంటావ్ అని అడుగగా.. దానికి తన దగ్గర ఒక ఐడియా ఉందని ఇండస్ట్రీలో తనకన్నా పెద్దవారు ఉన్నారు సల్మాన్ ఖాన్.. మరికొందరు.. వారి పెళ్లిళ్లు అయ్యాక తాను చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. పెళ్లి సరే.. సల్మాన్ ఖాన్ లా ఎఫైర్లు ఏమైనా ఉన్నాయా అనగా.. అలాంటివేమీ లేవని, అంతమంది కాదు కదా ఒక్కరితో కూడా అలాంటి ఎఫైర్ పెట్టుకోలేదని చెప్పుకొచ్చాడు. ఇక అమెరికాలో ఒక అమ్మాయిని ప్రేమించానని, ఆమెకు నా పుట్టినరోజునే పెళ్లి జరిగిందని, ఆ బాధను ఎప్పటికి మర్చిపోలేనని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ ప్రోమోనెట్టింట వైరల్ గా మారింది.