Adivi Sesh: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. బాలయ్య ముందు చెప్పినట్లుగానే కుర్ర హీరోలతో సందడి మాములుగా లేదు. రెండో ఎపిసోడ్ లో విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డతో సందడి చేసిన బాలయ్య మూడో ఎపిసోడ్ లో శర్వానంద్, అడివి శేష్ తో హంగామా చేశాడు. ఇక ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక టోటల్ ప్రోమోలో హాట్ టాపిక్ గా మారింది అడివి శేష్ ముద్దు ముచ్చట. బాలకృష్ణ.. ఇద్దరు కుర్ర హీరోలను తికమక పెట్టే ప్రశ్నలు అడిగి ఆడుకున్నట్లు ప్రోమో చూస్తుంటేనే తెలుస్తోంది.
ఇక ఈ నేపథ్యంలోనే ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న అని బాలయ్య.. “ఇప్పుడు ఈమెతో మాత్రం కిస్ వద్దురా బాబు అని అనుకొనే హీరోయిన్ ఎవరు అని అడుగగా టక్కున అడివి శేష్ పూజా హెగ్డే పేరు చెప్పేసి” షాక్ ఇచ్చాడు. అయితే రీజన్ ఎందుకు ఏంటి అని చెప్పలేదు కానీ, ఈ ఒక్క మాటతో ప్రస్తుతం శేష్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాడు. వీరిద్దరూ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినా ఆమెతో ముద్దు వద్దు అనడానికి కారణం ఏంటి..? శేష్ కావాలనే అన్నాడా..? లేకపోతే అంతకు ముందే ఈ జంట మధ్య గొడవలు ఏమైనా జరిగాయా..? అనేది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.