Aditya Dhar: నెక్స్ట్ హీరో ఫిక్స్.. ‘ధురంధర్’కి మూడింతల బడ్జెట్‌తో కొత్త ప్రాజెక్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘ఆదిత్య ధర్’ తెరకెక్కించిన ‘ధురంధర్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఓ సంచలనం అనే చెప్పాలి. గతేడాది చివర్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘ధురంధర్’ మొదటి భాగం ఏకంగా రూ. 1400 కోట్ల వరకు వసూలు చేసింది. దీంతో.. సెకండ్ పార్ట్ పై ఎక్కడా లేని హైప్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టే.. తక్కువ గ్యాప్‌లోనే సెకండ్ పార్ట్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేశాడు ఆదిత్య ధర్. ఇక ఈ సినిమా అంచనాలకు మించిన టాక్ సొంతం చేసుకుంది. రెండు రోజుల్లోనే రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసి దుమ్ముదులిపేస్తోంది ధురంధర్ 2. ఈ నేపథ్యంలో ఆదిత్య ధర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి చర్చ జరుగుతోంది.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
నిజానికి, ‘ధురంధర్ 3’ వస్తుందనే టాక్ నడిచింది. కానీ, ఆదిత్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘అశ్వథ్థామ’ను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ధురంధర్‌కి ముందే ఈ సినిమా చేయాల్సి ఉండగా.. భారీ బడ్జెట్‌తో పాటు ఇతర కారణాల వల్ల వర్కౌట్ కాలేదు. కానీ, ఇప్పుడు ధురంధర్ సంచలన విజయంతో ‘అశ్వథ్థామ’ మొదలు పెట్టబోతున్నాడు. లేటెస్ట్‌గా ఈ ప్రాజక్ట్ బడ్జెట్ వచ్చేసి దాదాపు రూ.800 కోట్లకు పైగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇది వెయ్యి కోట్లు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే.. ‘ధురంధర్’ సినిమా బడ్జెట్‌తో పోలిస్తే ‘అశ్వథ్థామ’ బడ్జెట్ రెండు మూడు రెట్లు ఎక్కువనే చెప్పాలి. ధురంధర్ రెండు భాగాలకు కలిపి రూ. 250 నుంచి రూ. 400 కోట్లు ఖర్చు చేశారు. ఇక అశ్వథ్థామ హీరో విషయానికొస్తే, పలువురు స్టార్ హీరోల పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. అటు ఇటు తిరిగి ధురంధర్ హీరో రణ్‌వీర్ సింగ్‌తోనే మరోసారి వర్క్ చేయడానికి ఆదిత్య ధర్ ఆసక్తి చూపిస్తున్నట్టుగా గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ హిట్ కాంబో రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా బాలీవుడ్ టాక్. అయితే, ఇంత తక్కువ బడ్జెట్‌లోనే ధురంధర్‌ను ఈ రేంజ్‌లో తీస్తే.. ఇక అశ్వథ్తామ బడ్జెట్‌కు ఏ రేంజ్ సినిమా తీస్తాడనే చర్చ జరుగుతోంది. మరి ఆదిత్య తన డ్రీమ్ ప్రాజక్ట్‌తో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!