Aditi Rao Hydari : టాలీవుడ్, బాలీవుడ్లలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ అదితి రావు హైదరీ తాజాగా సంచలన కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో తన పేరుతో జరుగుతున్న మోసంపై గట్టిగా స్పందించింది. తన పేరు, తన ఫోటోలను ఉపయోగిస్తూ ఒక వ్యక్తి నకిలీ సోషల్ మీడియా అకౌంట్లను క్రియేట్ చేసినట్టు అదితి వెల్లడించారు. ఈ మధ్య సెలబ్రిటీల ఫొటోలు, పేర్లతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే కదా. ఇప్పుడు అదితి రావు కూడా ఇలాంటి విషయాన్ని బయట పెట్టేసింది.
Read Also : Pawan Kalyan – Mahesh Babu : మొన్న పవన్ కల్యాణ్.. నేడు మహేశ్ బాబు.. అదే రిపీట్
‘ఓ వ్యక్తి వాట్సాప్, ఫేస్బుక్లో నా పేరుతో ఐడీలు ఓపెన్ చేసి, నా ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నాడు. నా పేరు మీద ఫోటోగ్రాఫర్లు, టెక్నీషియన్లకు మెసేజ్లు పంపుతున్నాడు. ఛాన్సులు కావాలంటూ అడుగుతున్నట్టు తెలిసింది. అది ఫేక్ అకౌంట్. దయచేసి వాడిని ఎవరూ నమ్మొద్దు. దీనిపై నేను లీగల్ గా చర్యలు తీసుకుంటాను అంటూ తెలిపింది అదితి రావు హైదరీ. తన అసలు అకౌంట్లు వెరిఫైడ్గా ఉంటాయని, మిగతా నకిలీ అకౌంట్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలని కోరింది.
Read Also : I Bomma Ravi : ఐ బొమ్మ రవికి సోషల్ మీడియాలో మద్దతు.. ఇదేం తీరు భయ్యా..?