సినిమాపై బజ్ క్రియేట్ చేయడం, ఆడియెన్స్‌కు ఇంట్రెస్ట్ కలిగించేలా ప్రమోషన్స్ చేయడం మామూలు విషయం కాదు. బట్ యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న’అధర్వ’ మీద ముందు నుంచి ఫిలిమ్ గోయర్స్ ఆసక్తి చూపుతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ‘అధర్వ’ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను ఎంతో గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ ఇటీవల విడుదల చేసిన టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌కు విశేషమైన స్పందన లభించింది. ‘నేను నమ్మిన సత్యం, వెతికే లక్ష్యం, దొరకాల్సిన సాక్ష్యం చేధించే వరకు ఈ కేసును వదిలిపెట్టను సార్’ అంటూ హీరో చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ మూవీ నుంచి హీరోకి సంబంధించిన యాక్షన్ లుక్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. హీరో కార్తీక్ రాజు ఇందులో పవర్‌ఫుల్ రోల్ పోషించినట్టు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బట్టి అర్థమవుతోంది.
‘ది సీకర్ ఆఫ్ ది ట్రూత్’ అనే ట్యాగ్ లైన్ తో ‘అధర్వ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘డీజే టిల్లు, మేజర్’ లాంటి సక్సెస్ ఫుల్ మూవీస్ కు సంగీతాన్ని సమకూర్చిన శ్రీచరణ్ పాకాల దీనికి స్వరకర్తగా వ్యవహరిస్తున్నాడు. చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సిమ్రాన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్, విజయరామరాజు తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.