బాలీవుడ్ బుల్లితెర నటి శ్వేతా తివారీ దేవుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. వెబ్ సిరీస్ ‘షో స్టాపర్’ ప్రమోషన్ లో భాగంగా భోపాల్ లో విలేకరులతో మాట్లాడుతూ “దేవుడు నా బ్రా కొలతలు తీస్తున్నాడు” అంటూ నోరు జారింది. ఇక దీంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దేవుడి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మధ్యప్రదేశ్ హోంమంత్రి కూడా ఖండించిన విషయం తెలిసిందే. దీంతో ఉదయం నుంచి అమ్మడి పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. ఇక దీంతో దిగొచ్చిన శ్వేత ఎట్టకేలకు క్షమాపణలు కోరింది.
“నేను చేసిన వ్యాఖ్యలు అందరికి వేరే విధంగా అర్ధం అయ్యింది. నేను దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. వెబ్ సిరీస్ లో శ్వేతతోపాటు నటిస్తున్న సౌరభ్ రాజ్ జైన్ బ్రా ఫిట్టర్ పాత్రను పోషించాడు. సౌరభ్ కృష్ణుడి తరహా పాత్రల్లో పోషించాడు. అతనిపై జోక్ చేస్తూ అన్నాను. స్వతహాగా ‘దేవుని’పై అపారమైన విశ్వాసం ఉన్న వ్యక్తిగా ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఏదీ తెలిసి, తెలియక చేయను, చెప్పను. అయితే సందర్భం లేకుండా ఈ మాట వినడం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని అర్థమైంది. దయచేసి నన్ను నమ్మండి, ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశ్యం నాకు ఎప్పుడూ లేదు. నన్ను క్షమించండి.” అంటూ చెప్పుకొచ్చింది. మరి అమ్మడి క్షమాపణలతో ఈ వ్యవహారం సద్దుమణుగుతుందేమో చూడాలి.